విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చిన మ్యాచుల్లో మూడో స్థానంలో చాలా మంది ప్లేయర్లను ప్రయత్నించింది భారత జట్టు. యంగ్ బ్యాటర్ తిలక్ వర్మతో పాటు అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ వంటి బ్యాటర్లకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ కల్పించింది...
అయితే వన్‌డౌన్ ప్లేస్‌లో ఏ బ్యాటర్ కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చి 3 పరుగులు చేసి రనౌట్ అయిన శ్రేయాస్ అయ్యర్, రెండో వన్డేలో సెంచరీతో చెలరేగాడు..
Shubman Gill Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ కలిసి రెండో వికెట్‌కి 200 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. ఓ ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకుంటే, అయ్యర్ వస్తూనే బౌండరీలు బాదాడు..
‘గాయం నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన ఈ సెంచరీ చాలా స్పెషల్. నా టీమ్ మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ నాకు అండగా నిలిచారు. నేను ఆడాల్సిన మ్యాచులను, టీవీ ముందు కూర్చొని చూడడం చాలా బాధగా ఉంటుంది..
నన్ను నేను నమ్ముకున్నా, నా టాలెంట్‌పై నమ్మకం ఉంచా. ఎంతటి నొప్పినైనా భరించడానికి సిద్దమయ్యా. నా టార్గెట్ ఏంటో నాకు క్లారిటీ ఉంది. దాని కోసం శ్రమించా...
విరాట్ కోహ్లీ గ్రెటెస్ట్ ప్లేయర్లలో ఒకరు. ఆయన స్థానాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. అది ఆయనకు మాత్రమే సొంతం. ఏ పొజిషన్‌లో ఆడమని టీమ్ చెప్పినా, ఆడేందుకు సిద్ధంగా ఉన్నా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్..