శుబ్‌మన్ గిల్ బాగా ఆడాడు కానీ... టీమిండియా యంగ్ సెన్సేషన్‌పై వీరూ కామెంట్స్...

First Published | Sep 25, 2023, 4:03 PM IST

అతి తక్కువ కాలంలోనే టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు శుబ్‌మన్ గిల్. వన్డేల్లో నిలకడైన ప్రదర్శనతో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా నిలవడానికి అడుగు దూరంలో నిలిచాడు...

Sehwag on Shubman Gill's performance

ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో 74 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రెండో వన్డేలో 104 పరుగులు చేసి అవుట్ అయ్యాడు... ఈ ఏడాది ఇప్పటికే వన్డేల్లో 1230 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 72.35 యావరేజ్‌తో అదరగొడుతున్నాడు..

‘మొదటి వన్డేలో శుబ్‌మన్ గిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. రెండో వన్డేలో దాన్ని అందుకున్నాడు. అయితే నాకు అతను అవుటైన విధానం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే శుబ్‌మన్ గిల్ అవుటయ్యే సమయానికి ఇంకో 15-18 ఓవర్లు ఉన్నాయి..

Latest Videos


Shubman Gill Shreyas Iyer

అతను ఈజీగా 160-180 పరుగులు చేసేయొచ్చు. ఇంకొంచెం ప్రయత్నిస్తే రెండో డబుల్ సెంచరీ కూడా బాదేసేవాడు. ఎందుకంటే ఇప్పుడు శుబ్‌మన్ గిల్ వయసు 24 ఏళ్లు. మరో ఐదారేళ్లు పోతే ఇంత సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే శక్తి ఉండకపోవచ్చు...

ఫామ్‌లో ఉన్నప్పుడే వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేయాలి. అలా అనవసర షాట్లకు ప్రయత్నించి అవుటైపోవడం కరెక్ట్ కాదు. రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేశాడు. గిల్, అలాంటి ఫీట్ రిపీట్ చేయగలడు..

Shubman Gill

ఇదే ఇండోర్‌లో నేను డబుల్ సెంచరీ చేశా. అది నాకు చాలా స్పెషల్. ఈ ట్రాక్ మీద కుదురుకుంటే అవుట్ చేయడం బౌలర్లకు చాలా కష్టం. గిల్ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.. ’ అంటూ కామెంట్ చేశాడు  వీరేంద్ర సెహ్వాగ్.. 

click me!