టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డు సమం చేసిన వాషింగ్టన్ సుందర్... సెంచరీ మిస్ అయినా...

Published : Mar 06, 2021, 12:08 PM IST

భారత ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌ గాయపడడంతో వారి స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు వాషింగ్టన్ సుందర్. గబ్బా టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన ఈ స్పిన్నర్, శార్దూల్ ఠాకూర్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పాడు.... ఇప్పుడు భారత టెస్టు టీమ్‌లో పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే అర్హతులున్న ప్లేయర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు...

PREV
19
టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డు సమం చేసిన వాషింగ్టన్ సుందర్... సెంచరీ మిస్ అయినా...

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన వాషింగ్టన్ సుందర్, నాలుగో టెస్టులో 96 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయిన వాషింగ్టన్ సుందర్, అద్భుతమైన ఇన్నింగ్స్‌లో టీమిండియాకు మంచి ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు..

29

టెస్టుల్లో 90ల్లో నాటౌట్‌గా నిలిచిన ఏడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. ఇంతకుముందు వాడేకర్ 91, విశ్వనాథ్ 97, వెంగ్‌సర్కార్ 98, రాహుల్ ద్రావిడ్ 91, రవిచంద్రన్ అశ్విన్ 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు..

39

టీమిండియా తరుపున 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. సచిన్ టెండూల్కర్ 2009లో శ్రీలంకపై జరిగిన వన్డేలో 96 పరుగులు చేసి అజేయంగా నిలిస్తే, విరాట్ కోహ్లీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

49

టెస్టు క్రికెట్‌లో మొదటి ఆరు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో రెండు సార్లు డకౌట్ అయ్యి, అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్ వాషింగ్టన్ సుందర్. గత రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్ అయిన సుందర్, ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 265 పరుగులు చేశాడు...

59

టీమిండియా తరుపున అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు వాషింగ్టన్ సుందర్. సుందర్ సగటు 66.25 కాగా, విరాట్ కోహ్లీ సగటు 52.37గా ఉంది... 

69

తొలి టెస్టులో 85, నాలుగో టెస్టులో 96 పరుగులు చేసిన సుందర్, 181 పరుగులతో ఇండియా, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ 345, రిషబ్ పంత్ 270, రవిచంద్రన్ అశ్విన్ 189 పరుగులతో టాప్ 3లో ఉన్నారు...

79

ఏడో వికెట్‌కి రిషబ్ పంత్‌తో కలిసి, ఎనిమిదో వికెట్‌కి అక్షర్ పటేల్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పాడు వాషింగ్టన్ సుందర్. ఒకే టెస్టులో 7, 8 వికెట్లకు సెంచరీ భాగస్వామ్యాలు రావడం ఇది మూడో సారి. ఇంతకుముందు 2008లో ఆస్ట్రేలియా, టీమిండియాపై ఈ ఫీట్ సాధిస్తే, 2011లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించింది...

89

‘వాషింగ్టన్ సుందర్‌లాంటి స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌ బ్యాటింగ్ ఆర్డర్‌లో 8వ స్థానంలో ఉండడం భారత జట్టుకు నిజంగా అదృష్టం. అతను సెంచరీ పూర్తి చేయకపోవడం చాలా బాధేసింది... కానీ భవిష్యత్తులో అతను ఎన్నో సెంచరీలు చేస్తాడు...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. 

99

2021లో భారత టెయిలెండర్లు ఏడు టెస్టుల్లో 737 పరుగులు జోడించారు. మిగిలిన జట్లలో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. పాక్ 568, ఇంగ్లాండ్ 439, బంగ్లాదేశ్ 414పరుగులతో ఉన్నారు...

click me!

Recommended Stories