రిషబ్ పంత్ ఇలాగే ఆడితే... యంగ్ వికెట్ కీపర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సీనియర్లు...

Published : Mar 06, 2021, 09:57 AM IST

రిషబ్ పంత్... ఇప్పుడు టీమిండియాలో అతనే సంచలనం. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకుంటూ, భారత జట్టులో చోటు కోల్పోయిన రిషబ్ పంత్, ఊహించని రీతిలో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా టూర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రిషబ్ పంత్, ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న సిరీస్‌లోనూ అదరగొడుతున్నాడు...

PREV
110
రిషబ్ పంత్ ఇలాగే ఆడితే... యంగ్ వికెట్ కీపర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సీనియర్లు...

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియాను అద్భుత శతకంతో ఆదుకున్నాడు రిషబ్ పంత్. రిషబ్ పంత్ గేమ్ ఛేజింగ్ ఇన్నింగ్స్ కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం సంపాదించగలిగింది..

210

118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు చేసిన రిషబ్ పంత్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఆడిన రివర్స్ స్వీప్ షాట్ మ్యాచ్‌కే హైలెట్... బెన్ స్టోక్స్, అండర్సన్, జాక్ లీచ్ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించాడు రిషబ్ పంత్...

310

రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్‌పై సీనియర్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ఎంత బాగుంది... నమ్మలేకపోతున్నా... ఒత్తిడిని ఎదుర్కొంటూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది మొదటిసారి కాదు, ఆఖరి సారి కాకూడదు. రాబోయే రోజుల్లో ఆల్‌ ట్రైమ్ గ్రేట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా రిషబ్ పంత్ నిలుస్తాడు.. ఇలాగే దూకుడుగా ఆడుతూ ఉండు. అదే నిన్ను మ్యాచ్ విన్నర్‌ని, స్పెషల్ బ్యాట్స్‌మెన్‌ను చేసింది...’ అంటూ ట్వీట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.

410

‘అతను సిక్సర్‌తో సెంచరీ పూర్తిచేసుకుంటాడని నేను ముందే చెప్పా, రిషబ్ పంత్ సరిగ్గా అదే చేశాడు. ఇది మోడ్రన్ ఇండియా. ఇప్పుడు యంగ్ ఇండియన్ క్రికెటర్లు ఏ మాత్రం భయం లేకుండా ఆడడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

510

‘ఇతను మెంటల్ ఎక్కినట్టు ఆడాడు కదా... బాగా ఆడావు స్పైడర్ మ్యాన్’ అంటూ రిషబ్ పంత్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేశాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ...

610

‘అండర్సన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ బౌండరీ, సిక్సర్‌తో సెంచరీ... రిషబ్ పంత్, దట్స్ మై బాయ్’ అంటూ రిషబ్ పంత్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు వీరేంద్ర సెహ్వాగ్.  సెహ్వాగ్ ట్వీట్‌పై స్పందించిన రిషబ్ పంత్, ‘నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను... వీరూ పాజీ, మీ నుంచి బెస్ట్ నేర్చుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు. 

710

‘రిషబ్ పంత్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. అతని నుంచి మేం కోరుకునేది ఇదే. వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ కూడా బాగుంది... ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో చాలా డెప్త్ ఉంది...’ అంటూ మాజీ క్రికెటర్ చేతన్ శర్మ ట్వీట్ చేశారు..

810

‘రిషబ్ పంత్ ఆడుతుంటూ చూడడానికి కన్నుల పండగగా ఉంది... ఈరోజు అతను ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం...’ అంటూ ట్వీట్ చేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్..

910

‘బ్రిస్బేన్‌ను రిషబ్ పంత్ మళ్లీ తీసుకొచ్చాడు... పంత్ మాస్టర్ ప్లేయర్’ అంటూ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్ కామెంట్ చేశాడు... ఇంగ్లాండ్ మరో మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్ ‘రిషబ్ పంత్ స్పెషల్ ప్లేయర్’ అంటూ ట్వీట్ చేశాడు.

1010

‘ఒరిజినల్ ప్లేయర్ రిషబ్ పంత్’ అంటూ మాజీ పేసర్ ఆర్‌పీ సింగ్ ట్వీట్ చేశాడు. ‘ప్రతీ సిరీస్‌లోనూ అందరి దృష్టి తనపై పడేలా చూసుకుంటున్నాడు. ఇది మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్. పంత్ సెంచరీ సంచలనం...’ అంటూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ బెల్ ట్వీట్ చేశాడు...

click me!

Recommended Stories