ఈ ఐదుగురికి అన్యాయం జ‌రిగిందా? అర్హ‌త‌లున్న టీమిండియాలోకి ఎందుకు తీసుకోలేదు?

First Published | Jul 19, 2024, 5:47 PM IST

Team India : భార‌త క్రికెట్ జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నుంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ టీ20, వన్డే సిరీస్‌ల కోసం స్క్వాడ్ ను ప్ర‌క‌టించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ తర్వాత టీ20 జ‌ట్టులో మార్పులు జ‌రిగాయి.
 

Sanju Samson, Abhishek Sharma,Ruturaj Gaikwad

భారత క్రికెట్ జట్టు జూలై 27 నుంచి జూలై 30 వరకు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ కూడా ఆడ‌నుంది. శ్రీలంకలో జరిగే సిరీస్ కోసం భారత టీ20, వన్డే జట్టులో అర్హ‌త‌లున్నా ప‌లువురు ప్లేయ‌ర్లు చోటు కోల్పోయారు. వారిలో ప్ర‌ధానంగా ఉన్న‌వారిలో.. 

ruturaj gaikwad

1. రుతురాజ్ గైక్వాడ్

భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ చాలా రోజులుగా నిరాశ‌ను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఈ పూణే బ్యాట్స్‌మన్‌కు టీ20 ఫార్మాట్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. అతను 39.56 సగటు, 143.53 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 633 పరుగులు చేశాడు. ఇక జింబాబ్వే పర్యటనలో మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వ‌చ్చి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, అత‌నికి శ్రీలంక ప‌ర్య‌ట‌న భార‌త జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. 

Latest Videos


Mukesh Kumar

2. ముఖేష్ కుమార్

ఇటీవల జింబాబ్వే పర్యటనలో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ మంచి ప్రదర్శన చేశాడు. హరారేలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మొత్తం ఎనిమిది వికెట్లు తీశాడు. అయినప్పటికీ అతను జట్టులోకి ఎంపిక కాలేదు. ఖలీల్ అహ్మద్ లాంటి ఆటగాళ్లు జ‌ట్టులోకి రావ‌డంతో చోటు ద‌క్కలేదు. 

Abhishek Sharma

3. అభిషేక్ శర్మ

ఐపీఎల్ 2024 త‌ర్వాత నుంచి భార‌త క్రికెట్ లో హాట్ టాపిక్ అభిషేక్ శ‌ర్మ‌. ఎందుకంటే ఐపీఎల్ లో ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించాడు. దీంతో అత‌నికి ఇటీవ‌ల ముగిసిన జింబాబ్వే సిరీస్ లో భార‌త జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఇక్క‌డ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అరంగేట్రంలో నాలుగు బంతుల్లో ప‌రుగులు చేయ‌కుండానే ఔట్ అయ్యాడు కానీ, రెండో మ్యాచ్ లో కేవలం 48 బంతుల్లోనే సెంచరీ సాధించి చ‌రిత్ర సృష్టించాడు. అతను శ్రీలంకతో సిరీస్‌కు భార‌త జ‌ట్టుకు ఎంపిక కాలేదు.

4. యుజ్వేంద్ర చాహల్

టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను మళ్లీ పట్టించుకోలేదు బీసీసీఐ. టీ20 ప్రపంచకప్ జ‌ట్టులో ఉన్నా అతను ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు అతను శ్రీలంకతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. చాహల్ 80 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు.

Sanju Samson

5. సంజు శాంస‌న్ 

సంజూ శాంసన్.. టీమిండియా గొప్ప ప్లేయ‌ర్. ఐపీఎల్ లో కెప్టెన్ గా ఒక జ‌ట్టును ముందుకు నడుపుతున్నాడు. భారత జ‌ట్టులోకి వ‌స్తూ పోతున్న ఈ ప్లేయ‌ర్ చాలా సార్లు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంకతో జ‌రిగే టీ20 సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో శాంసన్ సెంచరీ సాధించాడు. కానీ, ఇప్పుడు భార‌త వన్డే జ‌ట్టుకు ఎంపిక కాలేదు. 

click me!