టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసిన టాప్-5 బౌల‌ర్లు వీరే

First Published | Jul 16, 2024, 2:41 PM IST

Top-5 wicket taking bowlers : రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ టెస్ట్ క్రికెట్‌లో టాప్ వికెట్ టేకింగ్ 'పేసర్'గా ప్రసిద్ధి చెందాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ త‌ర్వాత టెస్టు క్రికెట్ కు వీడ్కోలు ప‌లికాడు. టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న టాప్-5 బౌల‌ర్లు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

Ashwin, Anil Kumble, Muttiah Muralitharan

Top-5 wicket taking bowlers :  ముత్తయ్య మురళీధరన్

శ్రీలంకకు చెందిన రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్ లో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్. శ్రీలంక తరఫున 133 టెస్టులాడి 800 వికెట్లు తీశాడు. క్రికెట్ లో  ఇప్ప‌టివ‌ర‌కు 800 వికెట్లు సాధించిన ఒకేఒక్క బౌల‌ర్ ముత్త‌య్య‌ మురళీధరన్. 2007లో వార్న్‌ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

షేన్ వార్న్:

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 145 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ తన రికార్డును బద్దలు కొట్టే వరకు అతను కొంతకాలం టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. వార్నర్ 2007లో టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.


James Anderson

జేమ్స్ ఆండర్సన్:

ఇంగ్లాండ్ లెజెండ‌రీ బౌల‌ర్. క్రికెట్ హిస్ట‌రీలో అత్య‌ధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌల‌ర్. మొత్తంగా టెస్టు క్రికెట్ లో 704 వికెట్లు తీసుకుని టాప్-5లో మూడో స్థానంలో ఉన్నాడు.

అనిల్ కుంబ్లే:

భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ లెజెండ‌రీ ప్లేయ‌ర్ భారత్ తరఫున 132 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2008లో కుంబ్లే తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.

స్టువర్ట్ బ్రాడ్:

ఇంగ్లాండ్ దిగ్గ‌జ బౌల‌ర్ల‌లో ఒక‌రు. మీడియం-ఫాస్ట్ బౌలర్ అయిన బ్రాడ్ టెస్ట్ క్రికెట్ లో 604 వికెట్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు. 2023లో ఈ ఫార్మాట్ కు రిటైర్ అయ్యే ముందు ఇంగ్లండ్ తరపున 167 టెస్టుల‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు.

Latest Videos

click me!