హార్దిక్ పాండ్యాతో విడాకులు.. కొత్త అమ్మాయితో డేటింగ్ రూమ‌ర్ల‌పై న‌టాషా రియాక్ష‌న్ ఇదే.. !

First Published | Jul 12, 2024, 5:20 PM IST

Hardik Pandya - Natasa Stankovic : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,  సెర్బియా మోడ‌ల్ నటాషా స్టాంకోవిచ్ లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ స్టార్ క‌పుల్ కు ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ జంట విడిపోతున్నార‌నేది సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్. 
 

Image credit: Natasa StankovicFacebook

Hardik Pandya - Natasa Stankovic : సెర్బియన్ డాన్స‌ర్, మోడల్-నటి నటాషా స్టాంకోవిక్ తన భ‌ర్త‌, టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకుంటున్నార‌నే వార్త‌లు గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. హార్దిక్ తో ఆమె విడాకులు తీసుకుంటున్నార‌నీ, అందుకే దూరంగా ఉంటున్నార‌నే చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 సంబ‌రాల్లో హార్దిక్ తో పాటు న‌టాషా క‌నిపించ‌క‌పోవ‌డంతో పాటు ఇదే స‌మ‌యంలో హార్దిక్ పాండ్యా మ‌రో అమ్మాయితో ముచ్చ‌టిస్తున్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో వీరి విడాకులు ఖాయం అనే విధంగా నెటిజ‌ట్లు రియాక్టు అవుతున్నారు. 

ఈ క్ర‌మంలోనే హార్దిక్ తో విడాకులు, మ‌రో అమ్మాయితో డేటింగ్ రూమ‌ర్ల‌పై న‌టాషా స్పందించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్ తో బంధం గురించి స్పందిస్తూ.. ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రజలు ఎలా త్వరగా తీర్పులు ఇస్తారనే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ఇప్ప‌టివ‌ర‌కు వీరిద్ద‌రూ విడాకుల రూమ‌ర్లపై మౌనంగా ఉన్నారు. దీంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడాకుల పుకార్లకు ఆజ్యం పోశాయి. 


హార్దిక్ కోసం కృనాల్ పాండ్యా చేసిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌లను నటాషా కూడా లైక్ చేశారు. కానీ ఆమె వారి వైవాహిక జీవితం, విడాకుల పుకార్ల గురంచి బహిరంగ ప్రకటనలు చేయలేదు. అయితే, తాజాగా నటాషా స్టాంకోవిక్ సానుభూతిని కోరిన‌ట్టుగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులో పేర్కొంది. "జస్ట్ యాదృచ్ఛిక ఆలోచనలు.. మనుషులుగా, మనం ఎంత త్వరగా తీర్పును ఇస్తున్నాము? ఎలాంటి ప‌రిస్థితులో చూడ‌కుండా కామెంట్స్ చేస్తున్నాం..  క్యారెక్టర్‌కి భిన్నంగా న‌డుచుకుంటే చాలు మ‌నం ఏ విష‌య‌మూ తెలుసుకోకుండా తీర్పు ఇచ్చేస్తాం.. కానీ, ఇలాంటిది వ‌ద్దు.. మరింత సానుభూతి కలిగి ఉండండి.. ఓపికగా ఉండండి" అని పేర్కొన్నారు.

కాగా, హార్దిక్ పాండ్యా, న‌టాషా స్టాంకోవిచ్ లు కొంత‌కాలం పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. కోవిడ్ స‌మ‌యం కావడంతో 2020లో తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది తమ కుమారుడు అగస్త్యకు జ‌న్మ‌నిచ్చారు. 2023లొ క్రిస్టియ‌న్, హిందూ ప‌ద్ద‌తిలో తమ కుటుంబం, స్నేహితులు, ప్రియమైన వారితో కలిసి మ‌రోసారి ఘ‌నంగా వివాహం జ‌రుపుకున్నారు. 

Latest Videos

click me!