శ్రీలంక స్పిన్నర్‌కి బంపర్ ఆఫర్... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడే ఛాన్స్...

Published : Jul 31, 2021, 12:52 PM IST

శ్రీలంక టూర్‌లో కరోనా వైరస్ రూపంలో ఆతిథ్య జట్టుకి అదృష్టం కలిసి వచ్చి, టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. 9 మంది స్టార్ ప్లేయర్లు లేకుండా బరిలో దిగిన టీమిండియా, చివరి రెండు టీ20ల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. అయితే లక్కీగా టీ20 సిరీస్ గెలిచిన లంక జట్టులో ఓ ప్లేయర్‌కి బంపర్ ఆఫర్ తగిలినట్టు సమాచారం...

PREV
17
శ్రీలంక స్పిన్నర్‌కి బంపర్ ఆఫర్... ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున ఆడే ఛాన్స్...

శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ, టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. అటు బ్యాటుతో, ఇటు బాల్‌తో రాణించి.... ఆఖరి టీ20లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కూడా గెలిచాడు...

27
ఆఖరి టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి, 4 కీలక వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ తీసిన హసరంగను, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడించేందుకు పావులు కదుపుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

Wanidu Hasaranga

37
రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి వికెట్లు తీసిన హసరంగ, రెండో టీ20లో బ్యాటుతోనూ రాణించి ఆకట్టుకున్నాడు. కీలకమైన దశలో 11 బంతుల్లో 2 ఫోర్లతో 15 పరుగులు చేసి, లంక విజయంలో తనవంతు పాత్ర పోషించాడు...

Wanindu Hasaranga

47
ఐసీసీ టీ20 బౌలర్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి అధిగమించిన హసరంగను, ఆస్ట్రేలియా యంగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా స్థానంలో ఆడించాలని భావిస్తోంది ఆర్‌సీబీ...

INDvsSL 3rd T20I

57
ఆర్‌సీబీతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కూడా హసరంగను ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం... అయితే ఆర్‌సీబీ ఇప్పటికే బీసీసీఐకి ఈ విషయమై రిక్వెస్ట్ కూడా పంపించేసిందట...

INDvsSL 3rd T20I

67
ఆర్‌సీబీలో ఇప్పటికే యజ్వేంద్ర చాహాల్ రూపంలో ఓ స్టార్ స్పిన్నర్ ఉన్నాడు. చాహాల్‌కి తోడు హసరంగ కూడా తోడైతే, యూఏఈ వేదికగా జరిగే మిగిలిన మ్యాచుల్లో ఆధిపత్యం చూపించవచ్చని భావిస్తోంది రాయల్ ఛాలెంజర్స్...

INDvsSL 3rd T20I

77
టీ20 వరల్డ్‌కప్ 2021 సమీపిస్తున్న సమయంలో హసరంగకు ఐపీఎల్ ఆడే అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 12కి అర్హత సాధించలేకపోయిన లంక జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఐర్లాండ్, నెదర్లాండ్, నమీబియాలతో మ్యాచులు ఆడనుంది.

INDvsSL

click me!

Recommended Stories