లంక క్రికెట్ బోర్డుకి షాక్... రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్ ...

First Published Jul 31, 2021, 12:09 PM IST

టీమిండియాపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచి, దాదాపు రెండేళ్ల తర్వాత ఓ సిరీస్ సొంతం చేసుకున్న లంక క్రికెట్ జట్టుకి ఊహించని షాక్ తగిలింది. లంక జట్టులో సీనియర్ పేసర్ ఇసురు ఉదాన, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

2009లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుతో టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన ఉదాన, 2012లో ఇండియాపై వన్డేల్లో ఆరంగ్రేటం చేశాడు. తన కెరీర్‌లో 21 వన్డేలు, 34 టీ20 మ్యాచులు ఆడిన ఉదాన.... మొత్తంగా 45 వికెట్లు పడగొట్టాడు.

isuru udana

గత సీజన్‌లో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఇసురు ఉదాన, 2020 సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఆడిన ఒకే ఒక్క లంక క్రికెటర్‌గా నిలిచాడు. 2021 మెగా వేలానికి ముందు ఉదానను ఆర్‌సీబీ రిలీజ్ చేయడం, వేలంలో ఉదానను ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడంతో ఈ సీజన్‌లో ఒక్క లంక క్రికెటర్ కూడా ఐపీఎల్ ఆడలేకపోయాడు...

Isuru Udana

ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన సిరీస్‌లో ఓ వన్డే, రెండు టీ20 మ్యాచులు ఆడిన ఉదాన, వికెట్లేమీ తీయలేకపోయాడు. దీంతో జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. కెరీర్ అసాంతం గాయాలతో ఇబ్బంది పడిన ఉదాన అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Isuru Udana

2019లో పాకిస్తాన్‌పై 3-0 తేడాతో టీ20 సిరీస్ గెలిచిన తర్వాత మళ్లీ ఇన్నాళ్లు కరోనా పుణ్యమాని, టీమిండియాపై 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలుచుకున్న శ్రీలంక జట్టుకి ఉదాన రిటైర్మెంట్ పెద్ద దెబ్బే...

Isaru Udana

33 ఏళ్ల ఇసురు ఉదాన, 2021 టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో కీలకంగా మారతాడని భావించింది లంక బోర్డు. సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించలేకపోయిన శ్రీలంక జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్‌తో మ్యాచులు ఆడనుంది. గ్రూప్ మ్యాచుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి.

Udana

click me!