మళ్లీ స్టైలిష్ లుక్‌లోకి మహేంద్ర సింగ్ ధోనీ... అంతా అతన్ని కలవడం వల్లే అంటున్న ఫ్యాన్స్...

First Published | Jul 31, 2021, 11:50 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ ఏం చేసినా అది సంచలనమే. క్రికెట్ ఫీల్డ్‌లో క్రేజీ షాట్స్, స్టన్నింగ్ వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను అలరించే మహేంద్రుడు, ఫ్యాషన్ ప్రపంచంలోనూ అనేక ట్రెండ్‌లను క్రియేట్ చేశాడు. లాంగ్ హెయిర్ నుంచి షార్ట్ క్లీన్ కట్ షేవ్ దాకా మాహీ క్రియేట్ చేసిన ట్రెండ్స్ లిస్టులోకి మరో అల్ట్రా స్టైయిలిస్ లుక్ కూడా చేరింది.

బాలీవుడ్ హెయిర్ స్టైయిలిష్ అలీమ్ హకీం, మహేంద్ర సింగ్ ధోనీకి చేసిన కొత్త హెయిర్ స్టైయిల్... ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. 25 ఏళ్ల కుర్రాడిలా మారిపోయిన 40 ఏళ్ల ధోనీ లుక్‌ను చూసి ఫ్యాన్స్ ఫుల్లుగా ఖుషీ అవుతున్నారు...

ms Dhoni

ఇప్పటిదాకా అనేక హెయిర్ స్టైయిల్స్, బియర్డ్ స్టైయిల్స్ మార్చిన ధోనీకి ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యిందని అంటున్నారు అభిమానులు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కి దూరమైన తర్వాత గుబురు గడ్డం, జుట్టుతో మాచో మ్యాన్‌లా కనిపించిన మాహీ మళ్లీ స్టైలిష్ అవతారంలో మారడానికి కారణం లేకపోలేదు...

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్‌‌కి మధ్యలోనే అర్ధాంతరంగా బ్రేకులు పడిన విషయం తెలిసిందే. సీజన్‌లో మిగిలిన 31 మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదలైంది... సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 పార్ట్ 2 జరగనుంది...
ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించి, బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ రూపొందించిన ప్రకటనల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించాడు మహేంద్ర సింగ్ ధోనీ. బ్రేక్ తర్వాత మళ్లీ రీ- స్టార్ట్ అవుతున్న సీజన్‌ యాడ్స్‌లో కూడా మాహీయే కనిపించబోతున్నాడు...
పార్ట్ 1లో బౌద్ధ గురువుగా కనిపించిన మహేంద్ర సింగ్ ధోనీ, పార్ట్ 2లో అల్ట్రా స్టైలిష్ ఐకాన్‌లా చూపించబోతున్నారట. ఇందుకోసమే మాహీ మళ్లీ ట్రెండ్ సెట్టర్‌గా మారిపోవాల్సి వచ్చింది...

ఇప్పటికే భారత జెర్సీలో మహేంద్ర సింగ్ ధోనీ కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టీమిండియా కొత్త జెర్సీలో మాహీని చూడలేకపోయిన ఫ్యాన్స్, ఇలా చూసి మురిసిపోతున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఫరాఖాన్, ఈ యాడ్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించాడు. మాహీ జెర్సీలో ఉన్న ఫోటోను పోస్టు చేసిన ఆమె, మాహీ లెజెండరీ క్రికెటర్ అయినా ఏ మాత్రం గర్వం లేదని, ఎంతో వినయంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయానంటూ కాప్షన్ ఇచ్చింది....

అయితే ధోనీ లుక్‌ మారిపోవడానికి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌యే కారణమంటున్నారు నెటిజన్లు. ఇన్నాళ్లు ఎంతో డీసెంట్‌గా కనిపించిన మాహీ, కొన్నాళ్ల కిందట రణ్‌వీర్‌తో కలిసి ఓ ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు...

అయితే ధోనీ లుక్‌ మారిపోవడానికి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌యే కారణమంటున్నారు నెటిజన్లు. ఇన్నాళ్లు ఎంతో డీసెంట్‌గా కనిపించిన మాహీ, కొన్నాళ్ల కిందట రణ్‌వీర్‌తో కలిసి ఓ ఛారిటీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు...

ఐదేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు సినిమాల్లోకి వస్తారా? అని అడిగిన ప్రశ్నకి, దానికి ఇంకా సమయం ఉందని సమాధానం ఇచ్చాడు మాహీ. దీంతో ఇప్పుడు మాహీ బాలీవుడ్ ఎంట్రీ చేస్తే అదిరిపోతుందని అంటున్నారు అభిమానులు...

Latest Videos

click me!