రిటైర్ అయ్యాక ఇండియా- పాక్ మ్యాచ్‌ని లైవ్‌లో చూస్తా... ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్...

First Published | Oct 29, 2022, 4:54 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కి అభిమానులకు ఒకేసారి పర్ఫెక్ట్‌గా సెట్ అయిన బిర్యానీ తిన్న ఫీలింగ్‌ని నింపేసింది. మొదటి ఓవర్ నుంచి ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్... కేవలం ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల అటెన్షన్‌ని కొట్టేసింది...

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో 90 వేలకు పైగా ప్రేక్షకుల మధ్య జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఆఖరి బంతికి గెలిచి... గత వరల్డ్ కప్ ఓటమికి అదిరిపోయే రివెంజ్ తీర్చుకుంది. ఈ మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్...

Virat Kohli

‘రిజల్ట్‌ ఏంటనేది పక్కనబెడితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అద్భుతంగా సాగుతుంది. నేను ఈ మ్యాచ్ చూసినప్పుడల్లా బాగా ఫీలవుతాను. ఎందుకంటే ఇలాంటి మ్యాచ్‌ని స్టేడియంలో చూడలేకపోతున్నానని బాధపడ్డాను...


Image credit: Getty

నేను రిటైర్ అయిన తర్వాత ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ జరిగినా అక్కడికి వెళ్లిపోయి లైవ్ చూడడానికి ఎదురుచూస్తున్నా... ఇలాంటి మ్యాచులను ఓ క్రికెటర్‌గా, క్రికెట్ ఫ్యాన్‌గా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా...

విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ కంప్లీట్ మాస్టర్ క్లాస్. ఆఖరి మూడు ఓవర్లలో కోహ్లీ ఆడిన షాట్స్... అస్సలు నమ్మలేకపోతున్నా. అంత ప్రెజర్‌లో, అన్ని వేల మంది మధ్య... ప్రత్యర్థులను ఒత్తిడిలో పడేయడం విరాట్‌కి మాత్రమే సాధ్యమేమో... ఆ ఇన్నింగ్స్‌ని చాలా సార్లు రిపీట్ వేసుకుని చూశా...

ఆస్ట్రేలియాలో కొన్ని వారాలుగా వర్షం పడుతోంది. స్టేడియాలు తడిసి ముద్ధవుతున్నాయి. ఇలాంటి సమయాల్లో మ్యాచులను సజావుగా నిర్వహించలేం కదా...’ అంటూ చెప్పుకొచ్చాడు ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్... 

Latest Videos

click me!