వాళ్లిద్దరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, జాగ్రత్త... శుబ్‌మన్ గిల్‌కి వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్...

Published : Mar 05, 2021, 03:00 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో రెండో టెస్టులో ఆరంగ్రేటం చేసిన భారత యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, తొలి టూర్‌లో ఆకట్టుకున్నాడు. మూడు హాఫ్ సెంచరీలతో పాటు ఆఖరి గబ్బా టెస్టులో 146 బంతుల్లో 91 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు శుబ్‌మన్ గిల్. ఆసీస్ టూర్ పర్ఫామెన్స్ ఆధారంగా ఇంగ్లాండ్ సిరీస్‌కి ఎంపికైన గిల్, గత నాలుగు టెస్టుల్లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...

PREV
17
వాళ్లిద్దరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, జాగ్రత్త... శుబ్‌మన్ గిల్‌కి వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్...

ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆడిన ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు శుబ్‌మన్ గిల్...

27

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే నాలుగో టెస్టులో మూడో బంతికే అవుట్ అయ్యాడు గిల్...

37

ఆస్ట్రేలియా టూర్‌లో తొలి టెస్టులో ఫెయిల్ అయిన పృథ్వీషా, విజయ్ హాజారే ట్రోఫీలో పరుగుల వరద పారించాడు. ఓ డబుల్ సెంచరీతో పాటు ఓ సెంచరీ కూడా బాదాడు. అదీకాకుండా మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ తుది జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నారు...

47

‘శుబ్‌మన్ గిల్ ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించాడు. మంచి టెక్నిక్‌తో బ్యాటింగ్ చేసి, భవిష్యత్తు స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్వదేశంలో గిల్ అవుటైన తీరు చూస్తుంటే, ఏదో టెక్నికల్ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది...

57

చెన్నై పిచ్‌తో పోలిస్తే అహ్మదాబాద్ పిచ్ చాలా ఫ్లాట్‌గా ఉంది. ఓపిగ్గా బ్యాటింగ్ చేసి, భారీ స్కోరు చేయొచ్చు... భారత బ్యాట్స్‌‌మెన్ దీన్ని గుర్తించాలి. ముఖ్యంగా వరుసగా ఫెయిల్ అవుతున్న శుబ్‌మన్ గిల్, త్వరగా తన టెక్నిక్‌ను సరిదిద్దుకోవాలి...

67

లేదంటే జట్టులో గిల్ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తుది జట్టులో చోటు కోసం కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ వంటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు ఎదురుచూస్తున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు వీవీఎస్ లక్ష్మణ్...

77

ఒక ఎండ్‌లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నా, మరో ఎండ్‌లో అతనికి సహకారం అందించే బ్యాట్స్‌మెన్ లేకపోవడంతో ఓపెనింగ్‌లో మంచి భాగస్వామ్యం నెలకొల్పలేకపోతోంది టీమిండియా... గిల్ తన టెక్నిక్‌ను సరిదిద్దుకుంటే, రోహిత్‌తో పాటు ఎక్కువ కాలం ఓపెనర్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది.

click me!

Recommended Stories