కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు... ఇషాంత్ తర్వాత అత్యధిక సార్లు డకౌట్... ధోనీ, గంగూలీ రికార్డులు సమం...

First Published Mar 5, 2021, 11:38 AM IST

రన్ మెషిన్‌గా పేరు పొందిన భారత సారథి విరాట్ కోహ్లీ, కెరీర్‌లోనే మొట్టమొదటిసారి బ్యాట్స్‌మెన్‌గా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. కెరీర్‌లో ఎన్నడూ లేనంతగా 476 రోజులుగా సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు విరాట్ కోహ్లీ. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు... 

విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్‌లో డిప్రెషన్ పీరియడ్‌గా చెప్పుకునే 2014 ఇంగ్లాండ్ టూర్‌లో ఒకే టెస్టు సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. మళ్లీ ఏడేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌పైనే ఒకే సిరీస్‌లో రెండు సార్లు డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
undefined
చెన్నైలో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మొయిన్ ఆలీ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు కోహ్లీ. ఈ రెండు మ్యాచుల్లోనూ శుబ్‌మన్ గిల్, మూడో బంతికే డకౌట్ కావడం మరో విశేషం...
undefined
అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధికసార్లు డకౌట్ అయిన భారత కెప్టెన్‌గా సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. సౌరవ్ గంగూలీ 13 సార్లు డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ కూడా 13 సార్లు డకౌట్ అయ్యాడు. మహేంద్ర సింగ్ ధోనీ 11, కపిల్ దేవ్ 10 సార్లు డకౌట్ అయ్యారు.
undefined
టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత సారథిగా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. మహేంద్ర సింగ్ ధోనీ తన టెస్టు కెప్టెన్సీ సమయంలో 8 సార్లు డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ కూడా 8 సార్లు డకౌట్ అయ్యారు. ధోనీ 60 టెస్టులకు సారథ్యం వహించగా ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు, విరాట్‌కి కెప్టెన్‌గా 60వ టెస్టు కావడం విశేషం.
undefined
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన భారత క్రికెటర్‌గా జస్ప్రిత్ బుమ్రా రికార్డును సమం చేశాడు విరాట్ కోహ్లీ. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బుమ్రా నాలుగు సార్లు డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ నాలుగో సారి డకౌట్ అయ్యాడు. షమీ, పూజారా మూడేసి సార్లు డకౌట్ అయ్యారు.
undefined
ప్రస్తుతం భారత జట్టులో ఉన్న ప్లేయర్లలో అత్యధిక సార్లు డకౌట్ అయిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 101వ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ, తన టెస్టు కెరీర్‌లో 32 సార్లు డకౌట్ కాగా, విరాట్ కోహ్లీ 12 సార్లు డకౌట్ అయ్యాడు. బుమ్రా 9 సార్లు డకౌట్ అయి, మూడో స్థానంలో ఉన్నాడు...
undefined
click me!