ఇంగ్లాండ్ టూర్‌కి ఎంపికైన తెలుగు కుర్రాడు కెఎస్ భరత్... సాహాకి బ్యాకప్ ప్లేయర్‌గా ఆంధ్రా వికెట్ కీపర్...

First Published May 20, 2021, 4:39 PM IST

ఎన్నో ఏళ్లుగా భారత జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగు కుర్రాడు కెఎస్ భరత్‌ ఇంగ్లాండ్ టూర్‌కి బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కరోనా బారిన పడిన వృద్ధిమాన్ సాహాకి బ్యాకప్‌గా శ్రీకర్ భరత్ కూడా ఇంగ్లాండ్‌కి వెళ్లనున్నాడు...

మే 4న కరోనా బారిన పడిన వృద్ధిమాన్ సాహా, దాని నుంచి కోలుకోవడానికి 14 రోజుల సమయం తీసుకున్నాడు. మే 18నే సాహాకి నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాతి నుంచే ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లే ప్లేయర్ల హోం క్వారంటైన్ మొదలైంది..
undefined
కరోనా నుంచి కోలుకుని, ఇంట్లో క్వారంటైన్ గడుపుతున్న వృద్ధిమాన్ సాహా, ఆలస్యంగా బయో బబుల్‌లోకి రానున్నాడు. ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లే భారత మహిళల, పురుషుల క్రికెటర్లను ముంబైకి చేర్చి, వారికి క్వారంటైన్ కోసం బయో బబుల్ ఏర్పాటుచేసింది బీసీసీఐ...
undefined
‘వృద్ధిమాన్ సాహా కరోనా నుంచి కోలుకున్నాడు. అయితే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో అతనికి బ్యాకప్ వికెట్ కీపర్‌గా భరత్‌ను ఎంపికచేశాం. సాహా ఫిట్‌నెస్ సాధించని పక్షంలో భరత్‌ చాలా మంచి ఆప్షన్ అవుతాడు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఇంగ్లాండ్‌లో ఉండనుంది భారత జట్టు. వారికి కచ్ఛితంగా రిషబ్ పంత్‌తో పాటు మరో వికెట్ కీపర్ అవసరం’ అంటూ తెలియచేసింది బీసీసీఐ.
undefined
ఇప్పటికే మిథాలీరాజ్, ఛతేశ్వర్ పూజారా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ప్లేయర్లు... బీసీసీఐ ఏర్పాటుచేసిన ఛార్టెడ్ ఫ్లైట్‌లో ముంబై చేరుకుని ఈ బయో బబుల్‌లోకి చేరిపోయారు. సాహా కాస్త ఆలస్యంగా ఈ బయో బబుల్‌లోకి రానున్నాడు.
undefined
కొన్నాళ్లుగా వృద్ధిమాన్ సాహా ఫిట్‌నెస్‌పై అనుమానాలు రేగుతుండడంతో మళ్లీ రిస్క్ చేయకూడదని భావించిన బీసీసీఐ, అతనికి బ్యాకప్ ప్లేయర్‌గా వైజాగ్ కుర్రాడు కెఎస్ భరత్‌ను ఎంపికచేసింది... భరత్ కూడా పూజారా అండ్ కో తో కలిసి బయో బబుల్‌లోకి వచ్చాడు..
undefined
రెండేళ్లుగా భారత జట్టులో ఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న కెఎస్ భరత్, మరోసారి బ్యాకప్ ప్లేయర్‌గానే జట్టులోకి వచ్చాడు. ఇంతకుముందు ఆసీస్ టూర్‌లో, ఇంగ్లాండ్ సిరీస్‌లో స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు భరత్..
undefined
రంజీ ట్రోఫీలో త్రిబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన కోన శ్రీకర్ భరత్, ఇప్పటిదాకా 69 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడి 3909 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్‌గా 232 క్యాచులు, 27 స్టంపౌంట్లు చేశాడు భరత్.
undefined
2019లో తొలిసారి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహాకి బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన శ్రీకర్ భరత్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్‌కి బ్యాకప్‌గా వ్యవహారించాడు...
undefined
ఐపీఎల్ 2021 వేలంలో శ్రీకర్ భరత్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే సీజన్‌లో భరత్‌కి ఇప్పటిదాకా తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు...
undefined
click me!