వాళ్లకి రూ.5 కోట్లు, వీళ్లకి రూ.50 లక్షలు... ఇదెక్కడి న్యాయం... మహిళల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ విడుదల..

First Published May 20, 2021, 12:40 PM IST

బీసీసీఐ మెన్స్ క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ విడుదల చేసిన నెల రోజుల తర్వాత మహిళా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది బీసీసీఐ. అయితే పురుష క్రికెటర్ల కాంట్రాక్ట్ మొత్తంతో పోలిస్తే, మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం 10 శాతం కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది...

అక్టోబర్ 2020 నుంచి సెప్టెంబర్ 2021 వరకూ సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టును విడుదల చేసింది బీసీసీఐ. ఇందులో గ్రేడ్ ఏలో ముగ్గురు ప్లేయర్లకు చోటు దక్కగా, గ్రేడ్ బీలో 10, గ్రేడ్ సీలో ఆరుగురు చోటు దక్కించుకున్నారు.
undefined
గ్రేడ్ ఏలో టీ20 టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, పూనమ్ యాదవ్‌కి చోటు దక్కింది. టీ20ల నుంచి తప్పుకోవడంతో వన్డే కెప్టెన్ మిథాలీరాజ్‌కి ఏ కేటగిరిలో చోటు దక్కలేదు...
undefined
వన్డే కెప్టెన్ మిథాలీరాజ్, సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, దీప్తి శర్మ, పూనమ్ రౌత్, రాజేశ్వరి గైక్వాడ్, షెఫాలీ వర్మ, రాధా యాదవ్, శికా పాండే, తానియా భాటియా, జెమీమా రోడ్రిక్స్... బీ కేటగిరిలో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.
undefined
కెటగిరీ సీలో మాన్షీ జోషీ, అరుంధతి రెడ్డి, పూజా వస్తాకర్, హర్లీన్ డియోల్, ప్రియా పూనియా, రిచా ఘోష్‌లకు స్థానం దక్కింది. వీరిలో షెఫాలీ వర్మకు తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కగా వేదా కృష్ణమూర్తిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది భారత క్రికెట్ బోర్డు..
undefined
వీరిలో గ్రేడ్ ఏ దక్కించుకున్న ప్లేయర్లకు ఏడాదికి రూ.50 లక్షలు, గ్రేడ్ బీ కేటగిరీ ప్లేయర్లకు రూ.30 లక్షలు, గ్రేడ్ సీ కేటగిరీ ప్లేయర్లకు రూ.10 లక్షలు వార్షిక వేతనంగా దక్కుతుంది. పురుష క్రికెటర్లకు రూ.7 కోట్ల నుంచి రూ.1 కోటి దాకా వార్షిక వేతనంగా అందిస్తోంది బీసీసీఐ.
undefined
పురుష క్రికెటర్లతో పోలిస్తే, మహిళా క్రికెటర్లకు చెల్లించే మొత్తం 10 శాతం కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎంత పురుష క్రికెటర్ల వల్ల బీసీసీఐకి లాభాల వర్షం కురుస్తున్నా, క్రికెటర్లకు చెల్లించే వేతనంలో మరీ 90 శాతం వ్యత్యాసం ఉండడం... న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు ఫెమినిస్టులు...
undefined
click me!