టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్... లంక పర్యటనకు అధికారికంగా ప్రకటించనున్న బీసీసీఐ...

First Published May 20, 2021, 1:00 PM IST

మాజీ క్రికెటర్, ‘మిస్టర్ డిపెండబుల్’, ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్‌ను భారత జట్టు కోచ్‌గా చూడాలనేది చాలామంది ఆకాంక్ష. పూర్తిస్థాయి కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ ద్రావిడ్ సుముఖత చూపకపోయినా, లంకలో పర్యటించే టీమిండియాకి కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నాడు..

జూలైలో లంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకి కోచ్‌గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వ్యవహారించబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత 2014లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టుకి బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహారించాడు ద్రావిడ్.
undefined
అయితే ఆ టూర్‌లో ఛతేశ్వర్ పూజారా, భువనేశ్వర్ కుమార్, మురళీ విజయ్ వంటి ఒక్కరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు మొత్తం విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సిరీస్ ఇదే...
undefined
భారత హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అండ్ కో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రధాన జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లనున్నారు.
undefined
విరాట్ కోహ్లీ టీమ్‌ ఛార్టెడ్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత లంకలో పర్యటించే భారత జట్టను ప్రకటించనుంది బీసీసీఐ. పరిమిత ఓవర్ల స్పెషలస్టు ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకి కెప్టెన్‌గా ఎవరు వ్యవహారిస్తారనేది కూడా ఇంకా తేలలేదు.
undefined
జూలైలో లంకలో పర్యటించే యువకులతో నిండిన భారత్ బి జట్టుకి మార్గదర్శకుడిగా భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ వ్యవహారించాల్సిందిగా కోరింది బీసీసీఐ. ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ద్రావిడ్ కూడా దీనికి అంగీకరించినట్టు సమాచారం...
undefined
ఇప్పటికే భారత్ ఏ జట్టుకి కోచ్‌గా వ్యవహారించిన రాహుల్ ద్రావిడ్, యువజట్టుకి కోచ్‌గా వ్యవహారిస్తే లంక టూర్‌లో భారత జట్టుకి ఎలాంటి ఇబ్బంది రాదని, అదీకాక లంక పర్యటనకి ఎంపికయ్యే అవకాశం ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, నటరాజన్ వంటి ప్లేయర్లు ద్రావిడ్ శిక్షణలో రాటుతేలినవారే కావడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తోంది బీసీసీఐ..
undefined
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహారిస్తున్న రాహుల్ ద్రావిడ్ సహాయకుడిగా భారత జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్తాడు. భారత మాజీ క్రికెటర్, ఎన్‌సీఏ లెవెల్ 3 కోచ్ డిప్లోమా సాధించిన పరాస్ మాంబ్రే, ఈ టూర్‌కి బౌలింగ్ కోచ్‌గా ఉంటాడు.
undefined
శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్, సూర్యకుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్‌లతో పాటు దేవ్‌దత్ పడిక్కల్ వంటి కొత్త కుర్రాళ్లకు లంక టూర్‌లో చోటు దక్కే అవకాశం ఉంటుందని సమాచారం... ఇంగ్లాండ్ సిరీస్‌లో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటే, ఈ యువజట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తాడు.
undefined
లేదంటే శిఖర్ ధావన్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్‌లలో ఎవరో ఒకరు టీమిండియా బీ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించే అవకాశం ఉంది. జూలై13, 16, 19లలో వన్డే సిరీస్ జరగనుంది. ఆ తర్వాత 22 నుంచి 27 దాకా టీ20 సిరీస్ జరుగుతుంది.
undefined
click me!