ధోనీ టీమ్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కాపాడలేడు... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

First Published | Oct 24, 2020, 6:24 PM IST

IPL 2020 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస ఫెయిల్యూర్‌తో ప్లేఆఫ్‌కి దూరమైంది. రోజురోజుకీ దారుణమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో పాతాళానికి పడిపోయింది సీఎస్‌కే. దీంతో మరోసారి చెన్నైపై కామెంట్ చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

క్రికెట్‌కి దూరమైనా తనదైన కామెడీ టైమింగ్‌తో క్రికెట్ అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
ఐపీఎల్ 2020 సీజన్ మొదలైనప్పటి నుంచి ‘వీరూ కీ బైఠక్’ పేరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లపై వరుస వీడియోలు చేస్తున్నాడు వీరేంద్ర సెహ్వాగ్...

రకరకాల గెటప్‌ల్లో కామెడీ పండిస్తూ దుమ్మురేపుతున్నాడు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ గెటప్‌లో వచ్చి, ‘తలైవా’ డైలాగ్‌లో వీడియో చేశాడు వీరూ...
‘తాను వాష్‌రూమ్‌కి వెళ్లొచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ టాపార్డర్ పెవిలియన్‌కి వెళ్లిపోయింది. 3 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సీఎస్‌కే... ఈ టీమ్‌ను సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా కాపాడలేడు’ అని వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్...
తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మ, చెన్నైతో మ్యాచ్‌కి దూరమయ్యాడు. అతని స్థానంలో సౌరబ్ తివారీ జట్టులోకి వచ్చాడు. తివారీపై కూడా తనదైన స్టైల్‌లో కామెంట్ చేశాడు వీరూ.
‘బరువు విషయంలో సౌరబ్ తివారీ, రోహిత్ శర్మ కంటే తక్కువోడేం కాదు. వడా పావ్‌కి బదులు, సమోసా పావ్...’ అన్నాడు వీరేంద్ర సెహ్వాగ్...
గత మ్యాచ్‌లో చెన్నై ప్రదర్శనపై చమత్కరిస్తూ... ‘సీఎస్‌కే సీనియర్ సిటిజన్స్ క్లబ్‌’గా మారిందంటూ వ్యాఖ్యానించాడు వీరూ.
ఈ కామెంట్లతో పాటు జట్టు కూర్పుపై వస్తున్న విమర్శలతో రెగ్యులర్ టీమ్‌లో మార్పులు చేసి యువకులకు అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
ஐபிஎல் 13வது சீசன் சிஎஸ்கேவிற்கு கொடுங்கனவாக அமைந்துவிட்டது. ஐபிஎல்லில் ஆடிய அனைத்து சீசன்களிலும் பிளே ஆஃபிற்கு முன்னேறிய சாதனையை படைத்திருந்த சிஎஸ்கே அணி, இந்த சீசனில் பிளே ஆஃபிற்கு முன்னேறாமல் லீக் சுற்றுடனேயே வெளியேறி, தங்களது பெருமையை இழந்துவிட்டது.
అయితే చాలా గ్యాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్ ఇద్దరూ డకౌట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచారు.

Latest Videos

click me!