చెన్నై సూపర్ కింగ్స్ సర్వనాశనం...‌ అప్పటిదాకా ఆగలేరు, ధోనీని కూడా తీసేస్తారేమో...

First Published Oct 24, 2020, 4:27 PM IST

IPL 2020 సీజన్‌ను సీఎస్‌కే ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు. పది సీజన్లలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారిగా ప్లేఆఫ్‌కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. అందులోనూ మొట్టమొదట ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది.

తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులకే పరిమితమైంది.
undefined
పవర్ ప్లేలోనే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్, 43 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది...
undefined
సామ్ కర్రాన్ అద్భుత హాఫ్ సెంచరీ కారణంగా ఆలౌట్ కాకుండా తప్పించుకున్న సీఎస్‌కే ఆటతీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా...
undefined
‘సీఎస్‌కే జట్టు వచ్చే ఏడాది ఐపిఎల్ వేలం దాకా కూడా ఆగకపోవచ్చు. ఇప్పటికిప్పుడు జట్టు మొత్తాన్నీ మార్చేయాలని అనుకుంటున్నారు వాళ్లు. ఇది సీఎస్‌కే రీబూట్ టైమ్... వాళ్లు ఎవరిని ఉంచుకుంటారు. అసలు ఎవ్వరినైనా ఉంచుకుంటారా... ధోనీని కూడా తీసేస్తారేమో’ అని వ్యాఖ్యానించాడు ఆకాశ్ చోప్రా.
undefined
అయితే సీఎస్‌కే సీఈవో విశ్వనాథ్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై, సారథి మహేంద్ర సింగ్ ధోనిపై పూర్తి నమ్మకం ఉందని, వాళ్లు కమ్ బ్యాక్ ఇస్తారని కామెంట్ చేశాడు.
undefined
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీని కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తున్నా, మాహీ మాత్రం సీఎస్‌కే నుంచి బయటికి వెళ్లాలని చూస్తున్నట్టు టాక్ వినబడుతోంది.
undefined
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఉండాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
సీఎస్‌కే ఓ సీనియర్ సిటిజన్స్ క్లబ్ అంటూ వ్యాఖ్యానించాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీతో పాటు కేదార్ జాదవ్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నారు...
undefined
ముంబై 10 వికెట్ల తేడాతో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. అయితే మిగిలిన మ్యాచుల్లో గెలిచి కనీసం పరువు నిలుపుకోవాలని చూస్తోంది ధోనీ టీమ్.
undefined
click me!