2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్... సీక్రెట్ బయటపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్..

First Published Jun 27, 2023, 3:51 PM IST

క్రికెట్‌ని మతంగా ఆరాధించే దేశంలో, అభిమానులకు మాత్రమే కాదు క్రికెటర్లకు కూడా సెంటిమెంట్లు ఉంటాయి. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేస్తుంటే అతని అన్న నితిన్ అస్సలు టీవీ చూసేవాడు కాదట. తాను చూస్తే సచిన్ అవుట్ అయిపోతాడని నమ్మేవాడు..

సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్‌కి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా మొదట ఎడమ కాలికి ప్యాడ్స్ కట్టుకునేవాడు. అలాగే హర్భజన్ సింగ్ బౌలింగ్ చేసేటప్పుడు తన క్యాప్‌ని సచిన్ టెండూల్కర్‌కి మాత్రమే ఇచ్చేవాడు. ఇలా చెప్పుకుంటే పోతే, సెంటిమెంట్లు పలు రకాలు..

2011 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ టీమిండియా క్రికెటర్లు ఇలాంటి సెంటిమెంట్లను పక్కగా ఫాలో అయ్యారట. తాజాగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, ఈ విషయాన్ని బయటపెట్టాడు..

Latest Videos


‘2011 వన్డే వరల్డ్ కప్ సమయంలో మాలో అందరికీ ఏదో ఒక మూఢనమ్మకం, సెంటిమెంట్ ఉండేది. అందరూ వాళ్ల సెంటిమెంట్స్‌ని వాళ్లు ఫాలో అయ్యేవాడు.. ధోనీ అయితే వరల్డ్ కప్ అయ్యేదాకా కిచిడీ మాత్రమే తిన్నాడు..

ఎందుకని అడిగితే, నేను పరుగులు చేయకపోయినా ఈ సెంటిమెంట్ వర్కవుట్ అవుతోందిగా. మనం మ్యాచులు గెలుస్తున్నాం... అది చాలుగా అనేవాడు... 

వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ కోసం మేం 2008 నుంచే ప్రిపరేషన్ మొదలెట్టాం. రోహిత్ టీమ్, వరల్డ్ కప్ గెలవాలంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్లానింగ్, ప్రిపరేషన్ చేసుకోవాలి.. 

ముందస్తు ప్రణాళికలు సిద్దంగా ఉంటే.. ప్లాన్ A వర్కవుట్ కాకపోతే ప్లాన్ Bతో గెలవచ్చు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... 

click me!