ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2011 టోర్నీ తర్వాత 12 ఏళ్లకు మళ్లీ 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో జరగనుంది. దీంతో ఈసారి టీమిండియాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. వరల్డ్ కప్ విడుదల సందర్భంగా భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు..
‘2011 వరల్డ్ కప్ సమయంలో టెండూల్కర్ కోసం ఆడాం. సచిన్ టెండూల్కర్‌కి వరల్డ్ కప్‌తో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని జట్టులో ప్రతీ ఒక్కరం అనుకున్నాం. ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఇది వర్తిస్తుంది..
26
టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీ కోసం వరల్డ్ కప్ గెలిచి తీరాలి. అతను ప్రతీ సారి 100కి 200 శాతం ఇచ్చాడు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీపైన విరాట్ కోహ్లీ ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటాడు..
36
అహ్మదాబాద్‌లో లక్షమందికి పైగా ప్రేక్షకులు వస్తారు. ఆ పిచ్ ఎలా స్పందిస్తుందో విరాట్ కోహ్లీకి బాగా తెలుసు. ఈసారి వరల్డ్ కప్ గెలవడానికి విరాట్ కోహ్లీ చేయాల్సిందంతా చేస్తాడని అనుకుంటున్నా..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..
46
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ, 2011 వన్డే వరల్డ్ కప్ ఆడాడు. ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ డకౌట్ కాగా సచిన్ టెండూల్కర్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
56
31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గౌతమ్ గంభీర్‌తో కలిసి మూడో వికెట్‌కి 83 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం జోడించాడు..
66
49 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచిన్ టెండూల్కర్‌ని భుజాల మీద ఎత్తుకుని స్టేడియమంతా కలియతిరిగాడు.