సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో ఒరగబెట్టిందేమీ లేదు! అతని కంటే ఆ ముగ్గురూ... - వీరేంద్ర సెహ్వాగ్

First Published | Sep 29, 2023, 12:56 PM IST

వన్డేల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నా, లక్కీగా వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ అవకాశాన్ని దక్కించుకున్నాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో ఐసీసీ నెం.1 బ్యాటర్‌గా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంగా అతన్ని వన్డే ప్రపంచ కప్ ఆడిస్తోంది టీమిండియా...

ఆస్ట్రేలియాతో మార్చిలో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఫ్లాప్ షో కొనసాగించాడు..

Suryakumar Yadav

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో మొదటి రెండు వన్డేల్లో హాఫ్ సెంచరీలు బాదాడు సూర్యకుమార్ యాదవ్. మూడో వన్డేలో మళ్లీ ఫ్లాప్ అయ్యాడు..


‘ఆరో స్థానంలో కెఎల్ రాహుల్ ఉన్నాడు, ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఈ రెండు పొజిషన్లలో ఆడలేదు. ఐదో స్థానంలో ఇషాన్ కిషన్ బాగా ఆడుతున్నాడు..

Suryakumar Yadav

హార్ధిక్ పాండ్యాని ఆరో బౌలర్‌గా ఆడించాలని అనుకుంటే, కెఎల్ రాహుల్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి రావాల్సి ఉంటుంది. అప్పుడు హార్ధిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కాబట్టి ఏడో స్థానంలో రవీంద్ర జడేజా రావాల్సి ఉంటుంది..

శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేసి, తన నాలుగో స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉన్నా అతన్ని ఆడించాలంటే నాలుగు, లేదా ఐదో స్థానాల్లోనే ఆడించాలి. కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌ కాలేడు..
 

Suryakumar Yadav

టీమ్ కాంబినేషన్ చాలా ముఖ్యం. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్‌కి ఓ అడ్వాంటేజ్ ఉంది. ఆసియా కప్‌ టోర్నీలోనూ ఇషాన్ కిషన్ రాణించాడు. అదీకాకుండా సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో ఇప్పటిదాకా ఒరగబెట్టిందేమీ లేదు..

Suryakumar Yadav

సూర్య ఆఖరి 15-20 ఓవర్లలోనే బ్యాటింగ్‌కి వస్తాడు. ఆ పొజిషన్‌లో తన టీ20 టాలెంట్‌తో స్కోరును బుల్లెట్ స్పీడ్‌తో పరుగెత్తించాలి. అయితే సూర్య చేసే పని, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్ కూడా చేయగలరు..

కాబ్టటి శ్రేయాస్ అయ్యర్, నాలుగో స్థానంలో ఆడితే సూర్యకుమార్ యాదవ్ రిజర్వు బెంచ్‌లో కూర్చోవాల్సిందే. రిషబ్ పంత్ కోలుకుంటే అప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లైనప్ మరింత జఠిలంగా మారుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. 

Latest Videos

click me!