ఆస్ట్రేలియాని తక్కువ అంచనా వేస్తే అంతే! వన్డే సిరీస్ ఓడిపోయినంత మాత్రాన...

First Published | Sep 29, 2023, 12:38 PM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు టీమిండియాతో వన్డే సిరీస్ ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఐదు సార్లు వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి కూడా వన్ ఆఫ్ ది ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటి...

టీమిండియాతో వన్డే సిరీస్‌కి ముందు సౌతాఫ్రికాలోనూ వన్డే సిరీస్ కోల్పోయింది ఆసీస్. మొదటి రెండు వన్డేల్లో గెలిచిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత వరుసగా 3 వన్డేల్లో ఓడింది. అయితే వన్డే సిరీసుల్లో ఓడినంత మాత్రాన ఆస్ట్రేలియాని ఏ మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు..

ఎందుకంటే 2007 వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా వరుసగా 5 మ్యాచుల్లో ఓడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2007 ప్రపంచ కప్‌ని ఆరంభించిన ఆసీస్, ఈసారి ప్రపంచ కప్ గెలవడం అసాధ్యమని తేల్చేశారు చాలామంది క్రికెట్ పండితులు..

Latest Videos


2003 వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరిన భారత జట్టు, 2007 ప్రపంచ కప్‌కి ముందు వరుస విజయాలు అందుకుంది. ఛేదనలో వరుసగా 22 విజయాలు అందుకుని, వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ధోనీ, యువరాజ్ వంటి యంగ్ ప్లేయర్లు బీభత్సమైన ఫామ్‌లో ఉండడంతో ఈసారి వరల్డ్ కప్, టీమిండియాదే అనుకున్నారు..

అయితే ప్రపంచ కప్‌ మొదలయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. 2007 వన్డే వరల్డ్ కప్‌లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగిన భారత జట్టు, బంగ్లాదేశ్ చేతుల్లో ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.  శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ ఓడి, గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది..

Ricky Ponting

మరోవైపు వరుసగా 5 వన్డేల్లో ఓడి, 2007 ప్రపంచ కప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా 11 వరుస విజయాలు అందుకుని.. వరుసగా మూడో ప్రపంచ కప్ అందుకుంది..

2003, 2007 వన్డే వరల్డ్ కప్స్ ఆడిన ఆండ్రూ సైమండ్స్, తన కెరీర్‌లో ఆడిన ప్రతీ వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకున్నాడు. ఈసారి కూడా ఆసీస్ నుంచి అలాంటి పర్ఫామెన్స్ రావచ్చని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

click me!