వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియాకి అదిరిపోయే రికార్డులు.. విరాట్ కోహ్లీ, రోహిత్, సచిన్ ఖాతాలో..

First Published | Sep 29, 2023, 11:22 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి ప్రారంభమయ్యే వన్డే ప్రపంచ కప్‌, నవంబర్ 19న ముగుస్తుంది. వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఖాతాలో కొన్ని అరుదైన రికార్డులు ఉన్నాయి..

24 ఏళ్ల 170 రోజుల వయసులో వన్డే వరల్డ్ కప్ టైటిల్‌ని గెలిచిన కపిల్ దేవ్, అతి పిన్న వయసులో ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్‌గా ఉన్నాడు. ఈసారి కూడా ఆ రికార్డుని ఎవ్వరూ బ్రేక్ చేయలేరు. ఎందుకంటే 2023 ప్రపంచ కప్‌లో కెప్టెన్లు అందరూ ఈ వయసు దాటినవారే..

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 9 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 2003 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ చేసిన 673 పరుగులే, ఇప్పటిదాకా ఓ ఎడిషన్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు..

Latest Videos


Image Credit: Getty Images

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో 350+ పరుగులు చేసి, 15కి పైగా వికెట్లు తీసిన ఒకే ఒక్క ప్లేయర్‌గా నిలిచాడు యువరాజ్ సింగ్. 2011 వన్డే వరల్డ్ కప్‌లో యువరాజ్ 362 పరుగులు చేసి, బౌలింగ్‌లో 15 వికెట్లు తీశాడు.

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఐదు సార్లు 50+ స్కోర్లు చేసిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. 2019 ప్రపంచ కప్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఏ కెప్టెన్‌ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాడు..

వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో ఐదు సెంచరీలు చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉంది. 2019 వన్డే వరల్డ్ కప్‌లో 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, సచిన్ 673 పరుగుల రికార్డుకి 25 పరుగుల దూరంలో ఆగిపోయాడు..
 

వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత వికెట్ కీపర్ రాహుల్ ద్రావిడ్. 1999లో శ్రీలంకపై ఈ ఫీట్ సాధించాడు రాహుల్ ద్రావిడ్. ఈసారి కెఎల్ రాహుల్ సెంచరీ చేస్తే, రాహుల్ ద్రావిడ్ రికార్డును సమం చేసినట్టు అవుతుంది.. 

click me!