WTC Final 2023: కోహ్లీతో జాగ్రత్త.. ఆసీస్ బౌలర్లకు చాపెల్ హెచ్చరిక

Published : Jun 04, 2023, 03:32 PM IST

WTC Final 2023:కోహ్లీకి  ఆస్ట్రేలియా పై మెరుగైన రికార్డే ఉంది.  టెస్టులలో కోహ్లీ.. ఆస్ట్రేలియాపై  24 టెస్టులు ఆడి 1,979 పరుగులు సాధించాడు. 

PREV
16
WTC Final 2023: కోహ్లీతో జాగ్రత్త..  ఆసీస్ బౌలర్లకు చాపెల్ హెచ్చరిక
Image credit: PTI

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో త్వరలో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆసీస్ బౌలర్లకు  ఆ జట్టు దిగ్గజం ఇయాన్ ఛాపెల్ హెచ్చరికలు జారీ చేశాడు. కోహ్లీని ఇంగ్లాండ్ బౌలర్ల మాదిరిగా  ఔట్ చేద్దామనుకుంటే అది వారికే  ప్రమాదమని  సూచించాడు. 

26

డబ్ల్యూటీసీ ఫైనల్స్  కు ముందు ఇయాన్ చాపెల్  ‘బ్యాక్ స్టేజ్ విత్ బొరియా మజుందార్’ లో మాట్లాడుతూ.. ‘విరాట్ 2014, 2021 లలో   ఇంగ్లాండ్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్, ఇతర ఇంగ్లీష్ బౌలర్ల  బౌలింగ్ లో ఇబ్బందులు పడ్డాడు. అప్పుడు వాళ్లు  ఇక్కడి పరిస్థితులను ఉపయోగించుకుంటూ  కోహ్లీని బోల్తా కొట్టించారు. 

36
Image credit: PTI

అయితే  ఇదే రీతిలో ఆస్ట్రేలియా బౌలర్లు కూడా కోహ్లీని బోల్తా కొట్టించాలని  చూస్తే మాత్రం అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ బౌలర్లకు ఇక్కడి కండీషన్స్ పై అవగాహన ఉంటుంది. అదీగాక కోహ్లీకి ఆస్ట్రేలియాపై మెరుగైన రికార్డు ఉంది.  అతడు ఆస్ట్రేలియా బౌలర్లను ఎంత ఇష్టంగా ఎదుర్కుంటాడనేది  కోహ్లీకి ఉన్న రికార్డులను బట్టి  అర్థం చేసుకోవచ్చు. 

46

నాకు తెలిసినంతవరకూ డబ్ల్యూటీసీ  ఫైనల్ జరుగబోయే    ది ఓవల్ గ్రౌండ్ బౌన్సీ వికెట్. అది విరాట్ బ్యాటింగ్ కు బాగా సూట్ అవుతుంది. ఓవల్ లో వాతావరణం కూడా ఇలాగే డ్రై గా ఉంటే  ఆ పిచ్ రాను రాను  బ్యాటింగ్ కు అనుకూలించే విధంగా మారుతుంది. అప్పుడు విరాట్ ను ఆపడం మరింత ప్రమాదకరం.  టీమిండియాకు  అప్పుడు పరుగుల వరద పారిస్తాడు..’అని చాపెల్ అన్నాడు.

56
Image credit: PTI

కోహ్లీకి  ఆస్ట్రేలియా పై మెరుగైన రికార్డే ఉంది.  టెస్టులలో కోహ్లీ.. ఆస్ట్రేలియాపై  24 టెస్టులు ఆడి 1,979 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీలు కూడా ఉండటం విశేషం.  ఈ క్రమంలో కోహ్లీ సగటు 48.26 గా ఉంది.     ఓవల్ లో కూడా  ఇదే ఫామ్ ను కొనసాగించాలని  కోహ్లీ భావిస్తున్నాడు.

66

కాగా గత ఆగస్టుకు ముందు  ఫామ్ కోల్పోయి క్రీజులో నిల్చోవడానికే తంటాలు పడ్డ  కోహ్లీ.. విరామం తర్వాత రెచ్చిపోతున్నాడు.   టీ20, వన్డేలు, టెస్టులలో సెంచరీలు బాదాడు. ఇటీవల  ఐపీఎల్ లో కూడా రెండు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేశాడు. ఇదే ఫామ్ ను డబ్ల్యూటీసీ ఫైనల్  లో కూడా కొనసాగించాలని   టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories