WTC Final 2023: ఆధునిక క్రికెట్‌లో ఫ్యాబ్ - 4 గా పిలుచుకునే ఆటగాళ్లలో కోహ్లీ, స్మిత్ లు ప్రథమ వరుసలో ఉంటారు. ఫార్మాట్లతో సంబంధం లేకుండా రాణించే ఈ దిగ్గజ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ లో రికార్డులు ఎలా ఉన్నాయి..?
మరో మూడు రోజుల్లో ఇండియా - ఆస్ట్రేలియా మధ్య ది ఓవల్ వేదికగా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే అక్కడకు చేరుకున్న భారత్ - ఆసీస్ లు తుది సమరానికి రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్లలోని టాప్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ లలో ఇంగ్లాండ్ లో బాగా ఆడింది ఎవరు..? రికార్డులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి..? అనేది ఇక్కడ చూద్దాం.
26
Image credit: PTI
కోహ్లీ తన టెస్టు కెరీర్ లో 108 టెస్టులు ఆడి 48.93 సగటుతో 8,416 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 28 సెంచరీలు, 28 అర్థ సెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 254 నాటౌట్ గా ఉంది.
36
Image credit: PTI
స్మిత్ తన కెరీర్ లో 96 టెస్టులు ఆడి 59.80 సగటుతో 8,792 పరుగులు చేశాడు. స్మిత్ పేరిట టెస్టులలో 30 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టులలో స్మిత్ టాప్ స్కోరు 239 గా ఉంది.
46
ఇక ఇంగ్లాండ్ లో ఈ ఇద్దరూ 16 టెస్టులు ఆడారు. కోహ్లీ 31 ఇన్నింగ్స్ లలో 1,033 పరుగులు సాధించగా స్మిత్.. 30 ఇన్నింగ్స్ లలో 1,727 రన్స్ సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ సగటు (ఇంగ్లాండ్‌లో) 33.33 గా ఉండగా స్మిత్ కు మాత్రం 59.55గా నమోదైంది.
56
ఇంగ్లాండ్ లో కోహ్లీ పేరిట రెండు సెంచరీలు, ఏడు అర్థ సెంచరీలు చేయగా స్మిత్ మాత్రం ఆరు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు చేశాడు.
66
గణాంకాలు స్మిత్ వైపునకే మొగ్గు చూపుతున్నాయి. అయితే కోహ్లీకి ఆస్ట్రేలియా పై మెరుగైన రికార్డే ఉంది. టెస్టులలో కోహ్లీ.. ఆస్ట్రేలియాపై 24 టెస్టులు ఆడి 1,979 పరుగులు సాధించాడు. ఇందులో సెంచరీలు కూడా ఉండటం విశేషం. ఈ క్రమంలో కోహ్లీ సగటు 48.26 గా ఉంది.