భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మల నాలుగో వివాహ వార్షికోత్సవం నేడు. నాలుగేళ్లు డేటింగ్ చేసి, ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న విరుష్క జోడీ, వార్షికోత్సవం సందర్భంగా తమ భాగస్వామికి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుకున్నారు...
‘there is no easy way out, there is no shortcut home... ఇది నీ ఫెవరెట్ సాంగ్, నువ్వు ఎప్పుడూ నమ్మే మాటలు కూడా. బంధాలలోని ప్రతీ నిజాన్ని దాచి పెట్టే మాటలు ఇవే...
211
ఎన్నో అంచనాలు, మరెన్నో లెక్కలతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ఓ ఉన్నతమైన వ్యక్తిని, నీలా నువ్వు బతకడానికి చాలా ధైర్యం ఉండాలి...అది నీలో చూశా...
311
నాకు అవసరమైనప్పుడు నువ్వు నాలో స్ఫూర్తి నింపుతావు. నేను ఏం చెప్పినా, ఓపిగ్గా వినడానికి సిద్ధంగా ఉంటావు. ఇద్దరు సమవుజ్జీల మధ్య పెళ్లి సక్సెస్ కావాలంటే, ఆ ఇద్దరి మధ్య నమ్మకం, భద్రత ఉండాలి...
411
నా వరకూ నువ్వే మోస్ట్ సెక్యూర్ మ్యాన్... కేవలం చాలా కొద్దిమందికి మాత్రమే నువ్వేంటో, నిజమైన నీ తత్వం ఏంటో తెలుసు. నీ విజయాల వెనక ఆత్మ ఏంటో తెలుసు...
511
వందల కోట్ల అంచనాల మధ్య ఆ నిజమైన మనిషి ఎప్పుడూ దాగి ఉంటాడు. నీ ప్రేమ, నమ్మకం, ప్రేమ, గౌరవం మాకు ఎప్పుడూ మార్గదర్శకాలే..
611
మనం ఎప్పుడూ ఇలాగే క్రేజీగా ఉందాం... మనలో నాకు నచ్చింది, నేను మెచ్చింది అదే...’ అంటూ భర్త విరాట్ కోహ్లీకి ఎమోషనల్‌గా వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ తెలిపింది అనుష్క శర్మ...
711
అనుష్క శర్మ, విరాట్‌తో దిగిన క్రేజీ ఫోటోలను పోస్ట్ చేసి విషెస్ చేస్తే, కూతురు వామిక కోహ్లీతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసిన విరాట్ కోహ్లీ, భార్యకు ఓ కవిత ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు...
811
‘నా సిల్లీ జోక్స్‌ను, నా బద్ధకాన్ని నాలుగేళ్లుగా భరిస్తున్నావ్... నేను నన్నుగా అంగీకరిస్తున్నావ్, నేను ఎలా ఉన్నా, దాన్ని ప్రేమిస్తున్నావ్...
911
ఈ నాలుగేళ్లు ఆ దేవుడు మనల్ని ఆనందంగా చూశాడు. ఎంతో నమ్మకమైన, ఎంతో ప్రేమను చూపించే ధైర్యవంతురాలైన మహిళను పెళ్లాడి నాలుగేళ్లు గడిచిపోయింది...
1011
సరైన పనులు చేయడానికి నాకు నువ్వు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నావ్. నిన్ను పెళ్లాడిన వాడిగా నాలుగేళ్లు నాకు నిండాయి. నన్ను ఎప్పుడూ సరిచేసే మార్గానికి నువ్వు...
1111
నువ్వు నా దానివి అయినందుకు ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటా. కుటుంబంగా ఇది మనకి మొట్టమొదటి వివాహ వార్షికోత్సవం. ఈ చిన్ని తల్లితో మన జీవితం పరిపూర్ణమైంది...’ అంటూ రాసుకొచ్చాడు విరాట్ కోహ్లీ...