గత ఏడాదిగా ఏ మాత్రం ఫామ్‌లో లేని మాజీ టెస్టు వైస్ కెప్టెన్ అజింకా రహానేని, సౌతాఫ్రికా టూర్‌కి ఎంపిక చేసిన టెస్టు టీమ్‌లో చోటు కల్పించారు సెలక్టర్లు. సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ వంటి యంగ్ ప్లేయర్లను పక్కనబెట్టి, రహానేని ఎంపిక చేయడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ చెబుతున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్ ప్రసాద్...
2021 సీజన్‌లో కేవలం 19.53 సగటుతో పరుగులు చేస్తున్న అజింకా రహానే, భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత పేలవమైన సగటు నమోదు చేసిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు...
28
‘విదేశీ పిచ్‌లపై రాణించడం అంత తేలికయ్యే విషయం కాదు, భారత్‌లో అద్భుతంగా పరుగులు చేస్తే బ్యాట్స్‌మెన్ కూడా సఫారీ ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లపై రాణించడానికి కష్టపడుతున్నారు...
38
అయితే అజింకా రహానేకి విదేశాల్లోనే ఇక్కడి కంటే మంచి రికార్డు ఉంది. ఇంతకుముందు చాలాసార్లు విదేశాల్లో అద్భుత బ్యాటింగ్‌కి భారత జట్టుని గెలిపించిన రికార్డులు కూడా అతనికి ఉన్నాయి...
48
అందుకే వరుసగా విఫలం అవుతున్నా అజింకా రహానేకి మరో అవకాశం ఇవ్వాలని బీసీసీఐ సెలక్టర్లు భావించి ఉంటారు. ఫామ్‌ను బట్టి అజింకా రహానే వంటి టెక్నిక్ ఉన్న ప్లేయర్లను పక్కనబెట్టడం కూడా కరెక్ట్ కాదు...
58
ఈసారి సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలిచేందుకు భారత జట్టుకి మంచి అవకాశం ఉంది. సీనియర్లతో పాటు జూనియర్లతో నిండిన జట్టు, సఫారీ గడ్డపై సత్తా చాటుతుందని అనుకుంటున్నా...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్...
68
సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి SENA దేశాల ఫాస్ట్ బౌలింగ్ ట్రాక్ పిచ్‌లపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు అజింకా రహానే...
78
ఈ దేశాల్లో విరాట్ కోహ్లీ 3551 పరుగులు చేస్తే, అజింకా రహానే 41.71 సగటుతో 2646 పరుగులు చేశాడు. గత ఏడాది 19.53 సగటుతో పరుగులు చేస్తూ, టెస్టు యావరేజ్ కూడా దిగజార్చుకుంటూ వస్తున్న రహానేకి సఫారీ సిరీస్ కీలకం కానుంది...
88
డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కావాల్సిన సౌతాఫ్రికా సిరీస్, కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కారణంగా డిసెంబర్ 26 బాక్సింగ్ డే టెస్టు నుంచి ప్రారంభం కానుంది...