బ్యాటింగ్‌పై పూర్తి ఫోకస్ పెట్టేందుకు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని విరాట్ కోహ్లీ, వన్డే కెప్టెన్సీ కూడా వదులుకోవాల్సిందిగా అతన్ని కోరింది బీసీసీఐ. వన్డే కెప్టెన్‌గా కోహ్లీని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న బీసీసీఐపై ఫైర్ అయ్యాడు విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందే ఆ టోర్నమెంట్ తర్వాత టీ20 కెప్టెన్‌గా కొనసాగనని స్వచ్ఛందంగా ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఈ నిర్ణయమే విరాట్, వన్డే కెప్టెన్సీ పోవడానికి కారణమైంది...
210
టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని బీసీసీఐ సెలక్షన్ ప్యానెల్, కోహ్లీని కోరడం... అందుకు కెప్టెన్ విరాట్ అంగీకరించలేదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్వయంగా ప్రకటించాడు...
310
టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత వైట్ బాల్ క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఎందుకనే ఉద్దేశంతో విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగిస్తూ బీసీసీఐ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చాడు గంగూలీ...
410
‘వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తొలగించారని తెలిశాక, అతనితో మాట్లాడేందుకు చాలా ప్రయత్నించా. అయితే ఎందుకో తెలీదు, విరాట్ కోహ్లీ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంది...
510
నన్ను అడిగితే విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్‌గా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడే బీసీసీఐ సెలక్టర్లు, తప్పుకోవాలని అనుకుంటే వన్డే, టీ20 కెప్టెన్‌గా తప్పుకోవాలని సూటిగా చెప్పాల్సింది...
610
నేను టీ20 కెప్టెన్‌గా తప్పుకోవాలని విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సెలక్టర్లు కోరినట్టు సౌరవ్ గంగూలీ చేసిన కామెంట్లు విని, నేను షాక్ అయ్యాను...
710
ఎందుకంటే అలా జరిగి ఉంటే, విరాట్ నాతో పంచుకుని ఉండేవాడు. నాకైతే అలాంటిదేమీ చెప్పలేదు. గంగూలీ కామెంట్ల చుట్టూ చాలా కథలు పుట్టుకొస్తున్నాయి కూడా...
810
వన్డేల్లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టుకి విజయాలు అందిస్తున్నాడు, ప్లేయర్‌గా మంచి రికార్డు ఉంది. అలాంటప్పుడు విరాట్‌ను తప్పించాల్సిన అవసరం ఏముంది...
910
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్‌గా ఎందుకు తప్పించాల్సి వచ్చిందో సెలక్షన్ కమిటీ వివరించాల్సింది. బీసీసీఐ, సెలక్షర్లు, మేనేజ్‌మెంట్ ఏం కావాలో తెలియాలి కదా...
1010
విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా, వన్డే కెప్టెన్‌గా ఆడింది ఒకే ఒక్క ఐసీసీ వరల్డ్ కప్. అంతదానికే ఐసీసీ టోర్నీ గెలవలేదని ఫెయిల్యూర్ కెప్టెన్‌గా నిర్ణయం తీసుకుంటారా? ఈ నిర్ణయంలో క్లారిటీ లేదు... న్యాయం అనిపించడం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ...