ఆసియా కప్ 2022 టోర్నీలో స్పెషల్ బ్యాటు వాడుతున్న విరాట్ కోహ్లీ... బాగా అచొచ్చిన ప్రత్యర్థిపై...

Published : Aug 24, 2022, 11:45 AM IST

ఆసియా కప్ 2022 టోర్నీకి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉండడంతో బ్యాటర్లపైనే ఆశలు పెట్టుకున్నారు టీమిండియా ఫ్యాన్స్. ముఖ్యంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చి, టీమిండియాని విజయతీరాలకు చేరుస్తాడని బోలెడు ఆశలు పెట్టుకున్నారు భారత అభిమానులు...

PREV
15
ఆసియా కప్ 2022 టోర్నీలో స్పెషల్ బ్యాటు వాడుతున్న విరాట్ కోహ్లీ... బాగా అచొచ్చిన ప్రత్యర్థిపై...
virat kohli

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత విరాట్ కోహ్లీ తన రేంజ్ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. సౌతాఫ్రికా టూర్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, దాదాపు ఐదేళ్ల తర్వాత సాధారణ ప్లేయర్‌గా ఆడడం వల్లనేమో  మ్యాచ్‌ని గెలిపించలేకపోయాడు...

25
Virat Kohli 2012 Asia Cup

ఐపీఎల్ 2022 సీజన్‌తో పాటు ఆ తర్వాత జరిగిన వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ విరాట్ కోహ్లీ నుంచి సరైన పర్ఫామెన్స్ రాలేదు. అదీకాక విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ పేరుతో ఆడని మ్యాచులే ఎక్కువ... 

35
virat kohli

అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ ఫామ్ అందుకుంటాడని ఆశిస్తున్నారు అభిమానులు...
పాకిస్తాన్‌పై విరాట్ కోహ్లీకి తిరుగులేని రికార్డు ఉంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో మిగిలిన బ్యాటర్లు అందరూ ఫెయిల్ అయినా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ఇన్నింగ్స్ కారణంగానే భారత జట్టు ఆ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది...

45


ఆసియా కప్ 2022 టోర్నీలో విరాట్ కోహ్లీ MRF గోల్డ్ విజర్డ్ స్పెషల్ ఎడిషన్ బ్యాటును వాడబోతున్నాడు. ఈ బ్యాటు ధర దాదాపు 62 వేల రూపాయలని సమాచారం. గోల్డ్ బ్యాటుతో గోల్డెన్ ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నారు కింగ్ కోహ్లీ డైహార్డ్ ఫ్యాన్స్...

55
Image credit: Getty

ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఆగస్టు 28న దుబాయ్ వేదికగా జరగనుంది. గత ఏడాది ఇదే మైదానంలో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మ్యాచ్ ఆడాయి భారత్, పాకిస్తాన్... 

Read more Photos on
click me!

Recommended Stories