1000+ రోజులుగా సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేసిన కోహ్లీ, పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండడం చూడలేకపోతున్నారు ఆయన అభిమానులు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత మరీ దారుణమైన గణాంకాలు నమోదు చేసిన విరాట్ కోహ్లీ... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడడం, ఆసియా కప్ పర్ఫామెన్స్‌పైనే ఆధారపడి ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు...
రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అగ్రెసివ్ యాటిట్యూడ్‌ని అలవర్చుకుంది టీమిండియా. రోహిత్ కెప్టెన్సీలో వరుస విజయాలు అందుకుంటున్న భారత జట్టు, టైటిల్ ఫెవరెట్‌గా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆసియా కప్ 2022 బరిలో దిగుతోంది...
27
Virat Kohli 2012 Asia Cup
అయితే క్రీజులో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకునే విరాట్ కోహ్లీ, ఈ అగ్రెసివ్ యాటిట్యూడ్ స్టైల్‌కి సెట్ కాలేకపోతున్నాడు. ఈ ఏడాది కేవలం నాలుగు టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ, 20.25 సగటుతో 114+ స్ట్రైయిక్ రేటుతో పెద్దగా మెప్పించలేకపోయాడు...
37
Image credit: Getty
‘నేను చాలా సార్లు చెప్పాను, విరాట్ కోహ్లీ లాంటి ‘బిగ్ గయ్స్’ సరైన సమయంలోనే నిద్ర లేస్తారు. ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లో లేకపోవడం చాలా మంచిది, ఎందుకంటే అతనిపై ఈసారి ఎలాంటి అంచనాలు ఉండవు..
47
పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక్క హాఫ్ సెంచరీ చేస్తే చాలు... ఇప్పుడు వాగుతున్న నోళ్లన్నీ మూతబడతాయి.. ఒకే ఒక్క ఇన్నింగ్స్ ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారంతా, మళ్లీ విరాట్‌ని పొగిడేలా చేయగలదు...
57
Virat Kohli
విరాట్ కోహ్లీ ఆకలి ఇంకా తీరలేదు. అది తీరదు కూడా. క్రికెట్ అంటే అతనికి అంత పిచ్చి. ఇప్పటిదాకా ఏం జరిగిందనే గతమే. జనాలు దేన్నీ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరు. వాళ్లకి ఒక్క ఇన్నింగ్స్ పడితే చాలు...
67
Image credit: Getty
భారత క్రికెట్ టీమ్‌లో విరాట్ కోహ్లీ ఫిట్టెస్ట్ ప్లేయర్. అతను ప్రాక్టీస్ చేసే విధానాన్ని ఎవ్వరూ అందుకోలేదు, అలాగే విలువలకి విరాట్ చాలా ప్రాధాన్యమిస్తాడు. అంకిత భావంలో విరాట్ తర్వాతే ఎవ్వరైనా...
77
Image credit: Getty
మనిషిలా కాకుండా ఓ యంత్రంలా పనిచేస్తాడు. అతను త్వరలోనే తన బెస్ట్ ఫామ్‌లోకి వస్తాడు... అది మనందరం చూస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...