పాకిస్తాన్‌ని వెనక్కినెట్టిన టీమిండియా... జింబాబ్వే సిరీస్ విజయంతో...

First Published Aug 23, 2022, 6:30 PM IST

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పెద్దగా వన్డేలపై శ్రద్ధ పెట్టడం లేదు. 2020లో ఆరు వన్డేలు మాత్రమే ఆడిన భారత జట్టు, గత ఏడాది కూడా పదికి తక్కువ మ్యాచులే ఆడింది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్నందుకు 2022లో మాత్రం కాస్త బెటర్‌గా వన్డేలకు కూడా ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది... ఇంగ్లాండ్, వెస్టిండీస్‌‌లపై వన్డే సిరీస్‌లు గెలిచిన భారత జట్టు, జింబాబ్వే టూర్‌లో వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో సొంతం చేసుకుంది...

వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకి గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా 2-1 తేడాతో వన్డే సిరీస్‌ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన జింబాబ్వే ప్లేయర్లు... సిరీస్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు..
తొలి రెండు వన్డేల్లో తొలుత బ్యాటింగ్ చేసి 200+ స్కోరు కూడా చేయలేకపోయిన జింబాబ్వే, మూడో వన్డేలో 290 పరుగుల లక్ష్యఛేదనలో 276 పరుగులు చేసి పోరాడి ఓడింది...

ఈ పర్పామెన్స్‌తో ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు టాప్ 3కి ఎగబాకింది. సిరీస్ ఆరంభానికి ముందు 99 పాయింట్లతో ఉన్న టీమిండియా, 12 పాయింట్లు సాధించి టాప్ 3కి వెళ్లగా, ఆ పొజిషన్‌లో ఉన్న పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై వన్డే సిరీస్ గెలిచినా టాప్ 4కి పడిపోయింది...

న్యూజిలాండ్ 124 పాయింట్లతో వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉంటే ఇంగ్లాండ్ 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 101 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ 5లో ఉంది.. టెస్టుల్లో మాత్రం ఆస్ట్రేలియా 128 పాయింట్లతో టాప్‌లో ఉంటే, టీమిండియా 114 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది...

సౌతాఫ్రికా 110, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ 100 పాయింట్లతో టాప్ 5 టెస్టు టీమ్స్‌గా ఉన్నాయి. టీ20ల్లో టీమిండియా టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. పొట్టి ఫార్మాట్‌లో 270 పాయింట్లతో భారత జట్టు టాప్‌లో ఉంటే ఇంగ్లాండ్ 262, పాకిస్తాన్ 261 పాయింట్లతో టాప్ 3లో ఉన్నాయి... 

ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో టాప్ 2లో కొనసాగుతుంటే.. నెదర్లాండ్స్‌పై ప్రతాపం చూపించిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ వన్డేల్లో, టీ20ల్లో నెం.1 పొజిషన్‌ని మరింత బలపర్చుకున్నాడు. వన్డేల్లో విరాట్ కోహ్లీ టాప్ 5కి పడిపోగా, రోహిత్ శర్మ టాప్ 6లో కొనసాగుతున్నాడు...

click me!