Rohit Sharma, Gautam Gambhir
Indian national cricket team: శ్రీలంక పర్యటన తర్వాత భారత జట్టు వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు ముందు బీసీసీఐ దులీప్ ట్రోఫీ కోసం జట్లను ప్రకటించింది. శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్ లు ఈ 4 జట్లకు కెప్టెన్‌లుగా ఉన్నారు. అలాగే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను ఎంపిక చేయలేదు. ఈ నలుగురితో పాటు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఎంపిక కాలేదు. స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఇంకా శిక్షణలో ఉన్నాడు. శ్రీలంక పర్యటనలో వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన శుఢ్ మన్ గిల్ సారథ్యంలోని 'ఏ' టీమ్‌లో ర్యాన్ పరాగ్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్ 'బీ' టీమ్ లో యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి కూడా జట్టులో భాగమే అయితే, జట్టులో ఉండటం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.
Image credit: PTI
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని 'సీ' టీమ్‌లో సూర్యకుమార్ యాదవ్, సాయి సుదర్శన్, రజత్ పటీదార్ వంటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఉన్న 'డీ' టీమ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ తో పాటు దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్ లు ఉన్నారు. నాలుగు జట్లకు కలిపి మొత్తం 61 మంది ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే 4 స్టార్ ప్లేయర్ల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ప్లేయర్లను టెస్టు క్రికెట్ ను నుంచి దూరం చేస్తున్నారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే, ఈ నలుగురు ఆటగాళ్ల విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సరైన ప్లాన్‌లో లేరా? అనే టాక్ కూడా నడుస్తోంది. వారిలో..
రింకూ సింగ్
భారత్ తరఫున వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్ టెస్టు క్రికెట్ లో కూడా ఆడాలని ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్నాడు. రింకూ 47 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 54.70 సగటుతో 3173 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిడిలార్డర్‌లో అతను అద్భుతమైన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ అని నిరూపించుకోగలడు. దులీప్ ట్రోఫీకి రింకూ ఎంపిక కాలేదు. దీన్ని బట్టి అతను సమీప భవిష్యత్తులో రోహిత్, గంభీర్ ప్లాన్‌లో లేడని తెలుస్తోంది.
సంజూ శాంసన్
భారత క్రికెట్‌లో అత్యంత దురదృష్టవంతుడుగా పిలవబడే ఆటగాడు సంజూ శాంసన్. శాంసన్ ఇటీవలి కాలంలో టీమ్ ఇండియాలో కనిపిస్తున్నాడు. కొన్నిసార్లు వన్డేల్లో, మరికొన్నిసార్లు టీ20 మ్యాచ్‌ల్లో అవకాశం వచ్చినా వరుసగా మ్యాచ్‌ల్లో తుదిజట్టులో ఆడలేదు. కొన్నిసార్లు 2, మరికొన్నిసార్లు 3 మ్యాచ్‌ల తర్వాత జట్టు నుంచి ఔట్ అయ్యాడు. ఎప్పుడు కూడా వరుసగా 15-20 మ్యాచ్‌లు ఆడలేదు. తన 9 ఏళ్ల కెరీర్‌లో కేవలం 16 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలిగాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో కేరళ తరఫున శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 62 మ్యాచ్‌ల్లో 38.54 సగటుతో 3623 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీకి కూడా శాంసన్ ను ఎంపిక చేయకపోవడంతో బీసీసీఐ సెలెక్టర్లు శాంసన్‌ను టెస్టు క్రికెట్ ఫార్మాట్ కోసం చూడటం లేదని స్పష్టం చేశారు.
Prithvi Shaw, IPL 2024,
పృథ్వీ షా
తన క్లాసిక్ స్టైల్ క్రికెట్ తో ప్రసిద్ధి చెందిన పృథ్వీ షా ఒకప్పుడు భారత క్రికెట్‌లో పెద్ద స్టార్ కొనసాగాడు. వెస్టిండీస్‌పై తన తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. అప్పట్లో ఈ ముంబై బ్యాట్స్‌మెన్‌ని మరో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ కాగలడని పోల్చారు. అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, పృథ్వీ పేలవమైన ఫిట్‌నెస్, వివాదాల కారణంగా జట్టుకు దూరమవుతున్నాడు. దీంతో జట్టులోకి తీసుకోవడం లేదు. ప్రస్తుతం పృథ్వీ ఇంగ్లండ్‌లోని కౌంటీ జట్లకు ఆడుతున్నాడు. దులీప్ ట్రోఫీకి అతన్ని ఎంపిక చేయకపోవడంతో అతను కూడా టెస్టు క్రికెట్ ఫార్మాట్ కోసం అతన్ని చూడటం లేదని తెలుస్తోంది.
యుజ్వేంద్ర చాహల్
భారత అనుభవజ్ఞుడైన స్పిన్ బౌలర్లలో ఒకరైన యుజ్వేంద్ర చాహల్‌కు ఇంకా టెస్టుల్లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పటి వరకు 72 వన్డేలు, 80 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 34 ఏళ్ల స్పిన్నర్ క్రికెట్‌లోని అతిపెద్ద ఫార్మాట్‌లో భారత్‌కు ఆడాలని కోరుకుంటున్నాడు. చాహల్ 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. దులీప్ ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. దీంతో సెలక్టర్లు అతడిని టెస్టు క్రికెట్ కోసం చూడటం లేదన్న విషయం స్పష్టమైంది.