అత‌నొక లెజెండ్.. అశ్విన్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లీ ఎమోష‌న‌ల్ కామెంట్స్

First Published | Dec 18, 2024, 10:33 PM IST

Ravichandran Ashwin: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ తర్వాత భారత సీనియర్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో భార‌త క్రికెట‌ర్లు భావోద్వేగానికి లోన‌య్యారు. 
 

Virat Kohli, Ravichandran Ashwin

Ravichandran Ashwin: లెజెండ‌రీ బౌల‌ర్ అనిల్ కుంబ్లే తర్వాత భారత రెండవ అత్యంత విజయవంతమైన టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఇకపై టీమిండియా త‌ర‌ఫున క్రికెట్ గ్రౌండ్ లో చూడలేము. తాను క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నాన‌ని చెప్పి అంద‌రినీ షాక్ కు గురిచేశాడు. బ్రిస్బేన్‌లో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో ఈ స్పిన్ లెజెండ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
 

అభిమానులు, క్రికెట్ వ‌ర్గాలు షాక్ 

ర‌విచంద్ర‌న్ అశ్విన్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్ తో పాటు ఆశ్చర్యానికి గురి చేసింది. అశ్విన్ 106 గేమ్‌లలో 537 టెస్టు వికెట్ల‌తో భారతదేశం తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తర్వాత అత్య‌ధిక వికెట్లు తీసిన  బౌల‌ర్ అశ్విన్. 

అభిమానులు, క్రికెట్ ల‌వ‌ర్స్ తో పాటు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. అశ్విన్‌, విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్‌తో కలిసి ఎమోషనల్‌గా క‌నిపిస్తూ కూర్చున్నాడు.


భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ 

భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. అశ్విన్ తన రిటైర్మెంట్ నిర్ణయం గురించి చెప్పినప్పుడు ఆర్ అశ్విన్ తనను భావోద్వేగానికి గురిచేశాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో కోహ్లీ అతన్ని అత్యంత విజయవంతమైన భారత ఆఫ్ స్పిన్నర్ అని పేర్కొన్నాడు. అతని రిటైర్మెంట్ తర్వాతి  కెరీర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. క్రికెట్ లో  ఆర్ అశ్విన్ త‌న‌కు అందించిన స‌హ‌కారం గురించి చెప్పారు. ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ 'భారత క్రికెట్‌లో లెజెండ్‌గా గుర్తుండిపోతాడు' అని పేర్కొన్నాడు. 

Ashwin-Virat Kohli

అశ్విన్.. భార‌త క్రికెట్ లో ఒక లెజెండ్ :   విరాట్ కోహ్లీ 

తన పోస్ట్‌లో అశ్విన్ గురించి విరాట్ కోహ్లీ.. "నేను మీతో 14 సంవత్సరాలు ఆడాను, ఈ రోజు మీరు రిటైర్ అవుతున్నారని చెప్పినప్పుడు, నేను కొద్దిగా భావోద్వేగానికి గురయ్యాను. మీతో కలిసి ఆడిన అన్ని జ్ఞాపకాలు నా ముందుకొచ్చాయి. నేను మీతో ప్రయాణంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. భారత క్రికెట్‌కు మీ నైపుణ్యం, మ్యాచ్ విన్నింగ్ సహకారం సాటిలేనిది. మీరు ఎప్పటికీ భారత క్రికెట్‌లో ఒక లెజెండ్‌గా గుర్తుండిపోతారని విరాట్ కోహ్లీ" పేర్కొన్నాడు.  

R Ashwin Virat Kohli

కాగా, రిటైర్మెంట్ ప్రకటనకు కొంత సమయం ముందు అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో కూర్చుని మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హఠాత్తుగా అశ్విన్ భావోద్వేగానికి గురయ్యాడు, ఆ తర్వాత విరాట్ అతన్ని కౌగిలించుకున్నాడు.

Latest Videos

click me!