విరాట్, రోహిత్ మధ్య గొడవలే దీనికి కారణమా... టీ20ల నుంచి సీనియర్లను సైడ్ చేస్తున్న బీసీసీఐ...

First Published | Jan 16, 2023, 1:54 PM IST

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని సూపర్ స్టార్లు. విరాట్ కోహ్లీ శతకాల మోత మోగిస్తూ సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డులను ఒక్కొక్కటిగా చెరిపేస్తూ పోతుంటే రోహిత్ శర్మ, వైట్ బాల్ క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు సృష్టించాడు... అయితే ఈ ఇద్దరి మధ్య ఇగో గొడవల గురించి నాలుగేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది.. 

టీ20ల్లో నాలుగు సెంచరీలు చేసిన రోహిత్ శర్మ, అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. మరోవైపు ఆసియా కప్‌లో ఆఫ్ఘాన్‌పై టీ20 సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ, పొట్టి ఫార్మాట్‌లో 4 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాటర్‌గా నిలిచాడు...

అయితే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ రిజల్ట్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా టీ20 ఫార్మాట్‌కి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఐపీఎల్ 2022 టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాని టీ20 కెప్టెన్‌గా కొనసాగిస్తున్న బీసీసీఐ, సీనియర్లను మాత్రం పొట్టి ఫార్మాట్‌కి పక్కనబెడుతూ వస్తోంది...


శ్రీలంకతో టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఉండడంతో ఈ ఇద్దరూ టీ20లకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి...

అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం టీ20ల నుంచి తప్పుకోలేదని, ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని కామెంట్ చేశాడు... ఈ కామెంట్లతో అభిమానుల్లో కొత్త అనుమానాలు రేగుతున్నాయి..

చూస్తుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ బలవంతంగా టీ20 ఫార్మాట్ నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. దీనికి ఈ ఇద్దరి మధ్య ఇగో గొడవలే కారణమని కూడా వార్తలు వస్తున్నాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఇద్దరు లెజెండరీ బ్యాటర్లు టీమ్‌లో ఉన్నా 12 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవలేకపోయింది టీమిండియా...

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన భారత జట్టు, రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీ ఫైనల్‌లో ఓడింది. ఈ ఓటములకు విరాట్ కోహ్లీ - రోహిత్ శర్మ మధ్య విభేదాలే కారణమని వార్తలు వినిపిస్తున్నాయి...

విరాట్ కోహ్లీ మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్‌ని అందుకుని వరుస సెంచరీలు చేస్తున్నాడు. గత ఏడాది విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి ఉంటే బీసీసీఐ, అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించే సాహసం చేసేది కాదు... బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంతో విరాట్ కోహ్లీ ఎంతో మనోవ్యధను అనుభవించాడు...

విరాట్ కోహ్లీకి వన్డే కెప్టెన్సీ పోవడానికి రోహిత్ శర్మే కారణమని కూడా టాక్ వినిపించింది. వన్డే కెప్టెన్సీ ఇస్తేనే, టీ20 కెప్టెన్సీ తీసుకుంటానని రోహిత్, బీసీసీఐని బెదిరించాడని వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉండే విరాట్‌కి ఈ వార్తలు తెలిసే ఉంటాయి...

ఈ వార్తల కారణంగానే ఆసియా కప్ 2022 టోర్నీలో, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో బ్యాట్స్‌మెన్‌గా అదరగొట్టిన విరాట్ కోహ్లీ, టీమ్‌ని మాత్రం మానసికంగా దెబ్బతీశాడని కూడా ఓ కథనం సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. 

Image credit: PTI

టీ20 వరల్డ్ కప్ 2022 సెమీస్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో 10 వికెట్ల తేడాతో ఓడిపోయిన చాలామంది భారత ప్లేయర్లు, నవ్వుతూ కనిపించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కెప్టెన్‌గా తన విలువేంటో బీసీసీఐకి తెలియాలని కోహ్లీ పావులు కదిలించాడని ఓ వర్గం వాదన...

ఈ ఇద్దరూ టీమ్‌లో ఉంటే ఇన్ని గొడవలు వస్తున్నాయనే ఉద్దేశంతోనే హార్ధిక్ పాండ్యా, సీనియర్లు వద్దని సెలక్టర్లతో వాదించాడట. తన మాట వినని సీనియర్ల కంటే కొత్త కుర్రాళ్లను టీ20 టీమ్‌కి ఎంపిక చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.. విరాట్, రోహిత్‌లకు ఆప్తుడైన కెఎల్ రాహుల్ కూడా టీ20 టీమ్‌కి దూరం కావడం విశేషం.. 

Latest Videos

click me!