సంజూ శాంసన్‌కి అయిన గాయం అంత తీవ్రమైందా? తప్పించడానికే డ్రామాలా...

Published : Jan 16, 2023, 01:20 PM IST

గత ఏడాది ఆడింది తక్కువ మ్యాచులు అయినా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు సంజూ శాంసన్. అయితే రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇచ్చిన భారత జట్టు, సంజూ శాంసన్‌ని ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసింది... రిషబ్ పంత్ గాయపడినా సంజూ శాంసన్‌కి అవకాశాలు రావడం లేదు.. 

PREV
15
సంజూ శాంసన్‌కి అయిన గాయం అంత తీవ్రమైందా? తప్పించడానికే డ్రామాలా...
Sanju Samson

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో సంజూ శాంసన్‌కి వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారంతా... అయితే శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో గాయపడిన సంజూ శాంసన్, వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు...

25
Sanju Samson

సంజూ శాంసన్ గాయపడ్డాడని, న్యూజిలాండ్‌తో జరిగే వన్డే,టీ20 సిరీస్‌‌ల నుంచి కూడా తప్పించింది బీసీసీఐ. సంజూ శాంసన్‌కి అయిన గాయం నిజంగా అంత తీవ్రమైందా? లేక అతన్ని జట్టుకు దూరం చేయడానికి ఈ గాయం డ్రామా ఆడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు...

35
Sanju Samson

కెఎల్ రాహుల్ వన్డేల్లో భారత జట్టుకి వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌ నుంచి కెఎల్ రాహుల్ తప్పుకున్నాడు. ఈ నెలాఖరులో అథియా శెట్టిని పెళ్లి చేసుకోబోతున్న కెఎల్ రాహుల్, కివీస్‌తో సిరీస్‌కి దూరమయ్యాడు...

45
Sanju Samson and Rishabh Pant

రిషబ్ పంత్ లేకపోయినా, కెఎల్ రాహుల్ వన్డే సిరీస్‌కి దూరంగా ఉన్నా సంజూ శాంసన్‌ని పక్కనబెట్టిన బీసీసీఐ... కెఎస్ భరత్, ఇషాన్ కిషన్‌లకు వికెట్ కీపింగ్ బ్యాటర్లుగా అవకాశం ఇచ్చింది. టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కి బదులుగా జితేశ్ శర్మ, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు సెలక్టర్లు...

55
Sanju Samson

సంజూ శాంసన్‌పై బీసీసీఐకి నమ్మకం లేదా? లేక అతన్ని సరిగ్గా వాడుకోవడం ఇష్టం లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. జితేశ్ శర్మ, కెఎస్ భరత్ ఈ సిరీస్‌లో బాగా ఆడితే సెలక్టర్ల కష్టాలు మరింత పెరుగుతాయి.. సంజూ శాంసన్‌ని పూర్తిగా టీమ్ నుంచి తప్పించడానికే సెలక్టర్లు ఈ విధమైన ఎత్తుగడ వేస్తున్నారని అంటున్నారు అభిమానులు...

click me!

Recommended Stories