బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ! వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ మొదటి మూడు మ్యాచుల్లో...

First Published | Oct 18, 2023, 6:49 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అన్ని జట్లు కూడా మూడేసి మ్యాచులు ఆడేశాయి. మొదటి 3 మ్యాచులు ఆడే సమయానికి మూడింట్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు టాప్‌లో ఉంటే, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది...
 

తాజాగా మొదటి మూడు మ్యాచుల్లో అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శన టాప్ 10 ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు.

Kohli Catch

విరాట్ కోహ్లీ మొదటి 3 మ్యాచుల్లో చూపించిన ఫీల్డింగ్‌ ఇంపాక్ట్‌కి 22.30 రేటింగ్ పాయింట్లు సాధించాడు. మిగిలిన భారత ప్లేయర్లు ఎవ్వరూ కూడా 15+ పాయింట్లు కూడా సాధించలేకపోయారు..


ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 21.73 పాయింట్లతో రెండో స్థానంలో ఉంటే, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 21.32 పాయింట్లు సాధించాడు. న్యూజిలాండ్ ఓపెనర్ డి వాన్ కాన్వే 15.54 పాయింట్లతో టాప్ 4లో ఉంటే, పాక్ వైస్ కెప్టెన్ షాదబ్ ఖాన్ 15.13 పాయింట్ల సాధించాడు..

Glen Maxwell

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 15 పాయింట్లు సాధించగా ఆఫ్ఘాన్ ప్లేయర్ రెహ్మత్ షా 13.77, న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్ సాంట్నర్ 13.28 పాయింట్లు దక్కించుకున్నారు..

ఒకే ఒక్క మ్యాచ్ ఆడిన పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ 13.01 పాయింట్లతో టాప్ 9లో ఉంటే, రెండు మ్యాచులు ఆడిన టీమిండియా యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ 13 ఫీల్డింగ్ ఇంపాక్ట్ పాయింట్లతో టాప్ 10లో ఉన్నాడు..
 

భారత జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్లు రవీంద్ర జడేజా, హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్‌లకు కూడా ఈ లిస్టులో చోటు దక్కకపోవడం విశేషం. మరో 3 మ్యాచుల తర్వాత మరోసారి ఫీల్డింగ్ ఇంపాక్ట్ లిస్టును ప్రకటించనుంది ఐసీసీ.. 

Latest Videos

click me!