మొట్టమొదటిసారిగా విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్ శర్మ... వన్డే వరల్డ్ కప్‌లో సెంచరీ కారణంగా..

మూడు ఫార్మాట్లలో నెం.1 బ్యాటర్‌గా నిలిచిన రికార్డు విరాట్ కోహ్లీ సొంతం. కొన్ని నెలల పాటు ఐసీసీ నెం.1 వన్డే బ్యాటర్‌గా కొనసాగిన విరాట్ కోహ్లీ, మూడేళ్ల పాటు పేలవ ఫామ్ కారణంగా ఆ ర్యాంకును కోల్పోయాడు. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ కోసం వన్డేలకు దూరంగా ఉండి, టాప్ 10లోనూ ప్లేస్ కోల్పోయాడు..
 

ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ... గత ఏడాదిలో వన్డేల్లో 5 సెంచరీలు బాదాడు. ఈ ఫామ్ కారణంగా మెల్లి మెల్లిగా మళ్లీ టాప్ 7లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ. విరాట్ నెం.1 వన్డే బ్యాటర్‌గా ఉన్నప్పుడు రోహిత్ శర్మ టాప్ 2లో ఉండేవాడు..

Virat Kohli

విరాట్ కోహ్లీ టాప్ 10 నుంచి పడిపోయిన సమయంలో కూడా రోహిత్ శర్మ, అతని కంటే కింది ర్యాంకులోనే ఉన్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో వరుసగా రెండు మ్యాచుల్లో అదరగొట్టిన రోహిత్ శర్మ, ర్యాంకింగ్స్‌లో విరాట్‌ని దాటేశాడు..


Rohit Sharma-Virat kohli

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 బంతుల్లో 131 పరుగులు చేసిన హిట్ మ్యాన్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగా రోహిత్ శర్మ, 5 స్థానాలు ఎకబాకి టాప్ 6లోకి వచ్చాడు..

Rohit Sharma

ఆస్ట్రేలియాపై 85 పరుగులు చేసి అవుటైన విరాట్ కోహ్లీ, ఆ తర్వాత ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 16 పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ రెండు స్థానాలు దిగజారి, టాప్ 9కి వచ్చాడు..

Shubman Gill-Babar Azam-Virat Kohli

డెంగ్యూతో రెండు మ్యాచులకు దూరమైన శుబ్‌మన్ గిల్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడినా 16 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇదే మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, తన టాప్ ర్యాంకును కాపాడుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు బాబర్ ఆజమ్‌కి, శుబ్‌మన్ గిల్‌కి కేవలం 5 పాయింట్ల తేడా మాత్రమే ఉండగా, ప్రస్తుతం అది 18 పాయింట్లకు చేరింది..

Latest Videos

click me!