రోహిత్ శర్మ, టీమిండియాకి నెక్ట్స్ ధోనీ! టీమ్ ప్లేయర్లు కూడా అదే అన్నారు.. - సురేష్ రైనా

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. కేవలం 8 సీజన్లలోనే 5 ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ, టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కించుకున్నాడు. కేవలం ఐపీఎల్ సక్సెస్ కారణంగానే విరాట్‌ని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి, రోహిత్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ...
 

Dhoni-Rohit

రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్ 2018 టైటిల్ గెలిచిన భారత జట్టు, 2023 ఆసియా కప్‌ టోర్నీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేసింది. ఫైనల్‌లో టీమిండియా దూకుడు ముందు శ్రీలంక పూర్తిగా తేలిపోయింది..

2023 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగింది టీమిండియా. మొదటి 3 మ్యాచుల్లో అద్భుత విజయాలు అందుకుని, ప్రస్తుతానికి వన్ ఆఫ్ ది టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది..


‘టీమ్‌లోని యంగ్ ప్లేయర్లతో మాట్లాడడం నాకెంతో ఇష్టం. వాళ్లతో మాట్లాడితేనే టీమ్ వాతావరణం గురించి తెలుస్తుంది. టీమ్‌ ప్లేయర్లతో మాట్లాడినప్పుడు అప్పట్లో ధోనీని ఎంత గౌరవించేవాళ్లో, రోహిత్‌కి కూడా అలాంటి గౌరవమే దక్కుతోంది...

ధోనీలాగే రోహిత్ కూడా డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నన్ను అడిగితే రోహిత్ శర్మ, టీమిండియాకి నెక్ట్స్ ధోనీ అని చెబుతా.. అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ని షేర్ చేసుకున్నా..

రోహిత్ చాలా కూల్ అండ్ కామ్. ప్రతీ ప్లేయర్ అభిప్రాయాన్ని ఎంతో శ్రద్ధగా, ఓపికగా వింటాడు. ఫామ్‌లో లేని ప్లేయర్లకు నమ్మకం ఇచ్చి, బాగా ఆడేలా చేస్తాడు. ముందుండి నడిపించడానికి బాగా ఇష్టపడతాడు..

Rohit Sharma

కెప్టెన్ బాగా ఆడుతుంటే, డ్రెస్సింగ్ రూమ్‌లో అతనిపై గౌరవం ఆటోమేటిక్‌‌గా పెరుగుతుంది. టీమ్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా.. 

Latest Videos

click me!