tattoo
ఈ కాలంలో టాటూలను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారేమో. తమకు నచ్చిన వ్యక్తి పేరు లేదా, ఫోటో లేదా ఇంకేదైనా ఇలా చాలా మంది టాటూలను తమ శరీరంలో నచ్చిన పార్ట్ లో వేయించుకుంటూ ఉంటారు. ఈ విషయంలో తాము కూడా తీసిపోమని నిరూపిస్తున్నారు.. మన ఐపీఎల్ స్టార్ క్రికెటర్లు. ఎవరెవరు.. టాటూలు వేయించుకున్నారో.. ఆ క్రికెటర్లు ఎవరో చూద్దాం..
మన క్రికెట్లు. అద్భుతమైన ఆటగాళ్లు మాత్రమే కాదు.. చాలా స్టైలిష్ కూడా. ఈ విషయాన్ని వాళ్లు చాలా సార్లు నిరూపించుకున్నా రు కూడా. కాగా.. ప్రస్తుతం.. మన క్రికెటర్లంతా ఐపీఎల్ కోసం.. యూఏఈలో ఉన్న విషయం కూడా మనకు తెలిసిందే. కాగా.. ఆ ఆటలోనూ.. చాలా సార్లు మన కళ్లకు టాటూలతో దర్శనమిచ్చిన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
శిఖర్ ధావన్.. రెండు చేతుల మీద అద్భుతమైన టాటూలు కనిపిస్తూ ఉంటాయి. ఆ టాటూ కి అర్థం ఏంటో తెలీదు కానీ.. చూడటానికి మాత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి.
హార్దిక్ పాండ్య మైదానంలో పులి; అదేవిధంగా, అతను తన ఎడమ చేతి పై పులి టాటూ వేయించుకున్నాడు. ఇక అతని మెడపై శాంతి చిహ్నాన్ని కూడా పచ్చబొట్టుగా వేసుకున్నాడు, తన పెంపుడు కుక్కల పాదాలు కూడా ఆయన టాటూ వేయించుకోవడం విశేషం. . అతనికి రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలిసినదే.
డిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ ఉమేష్ యాదవ్ కూడా ప్రత్యేకమైన టాటూ కలిగి ఉన్నారు. అతని చేతి మీద శివుడు టాటూ స్పష్టంగా కనపడుతూ ఉంటుంది.
ఇక.. టీమిండియా క్రికెటర్.. చాలా మంది ఫేవరేట్ కేఎల్ రాహుల్ కూడా టాటూ వేయించుకున్నారు. ఎడమ చేతి మీద పెద్ద టాటూ ఉంటుంది. రోమన్ నెంబర్లతో ఓ టాటూ ఉంటుంది. అతని ఆబ్స్ మీద కూడా ఓ టాటూ ఉంటుంది. ఈ టాటూలతో ఆయన చాలా హాట్ గా కనిపిస్తుంటారు.
టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టాటూ ప్రియుడే. ఈ వరల్డ్ ఫేమస్ క్రికెటర్ చేతిపై కూడా పెద్ద టాటూ ఉంటుంది.
ఇక క్రికెటర్ రవీంద్ర జడేజాకి గుర్రం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన తనకు నచ్చిన గుర్రాన్ని.. టాటూ గా వేయించుకున్నారు. ఆయన ఓ గుర్రాన్ని కూడా పెంచుకుంటున్నారు.
క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా టాటూ ఫ్యానే. ఆయనకున్న ఫ్యాషన్ సెన్సేంటే.. ఆ టాటూలు చేస్తూ అర్థమౌతుంది. ఆయన తన శరీరంపై దాదాపు 18 టాటూలు వేయించుకోవడం గమనార్హం. అందులో.. తన తల్లిదండ్రుల ముఖాలు, భార్య పేరు కూడా ఉండటం గమనార్హం.