IPL 2021: భార్యల బర్త్ డే వేడుకల్లో రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లు.. షాంపైన్ తో రచ్చ చేసిన మిస్టర్ 360

First Published | Sep 28, 2021, 11:57 AM IST

IPL 2021 RCB: ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ గెలిచి  ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులకు సోమవారం డబుల్ బొనాంజా. ఆ టీమ్ కు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల భార్యల పుట్టినరోజు సోమవారమే కావడంతో ఆటగాళ్లంతా కొద్దిసేపు ఆటకు ఫుల్ స్టాప్ పెట్టి వేడుకల్లో మునిగి తేలారు.

నిన్న రాయల్ ఛాలెంజర్స్  స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ  బర్త్ డే. ఈ  సందర్భంగా అతడు  ధనశ్రీ తో కలిసి పార్టీ మూడ్ లోకి వెళ్లాడు.  

ఇందుకు సంబంధించిన ఫోటోలను అతడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.  ప్రియమైన భార్యకు బర్త్ డే విషెస్ చెబుతూ హ్యాపీ బర్త్ డే  మై లవ్.. నా జీవితానికి వెలుగునిచ్చిన దేవదూతకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. అంటూ అందులో రాసుకొచ్చాడు. 


చాహల్ తో పాటు  మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ భార్య డేనియల్ డివిలియర్స్ బర్త్ డే కూడా నిన్ననే కావడం విశేషం. 

ఈ సంద్భంగా డివిలియర్స్ ఆమెకు షాంపైన్ గిఫ్ట్ గా ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పాడు. ఏబీ ఆమెను హోటల్ రూఫ్ టాప్ కు తీసుకెళ్లి అక్కడ  విషెస్ తెలియజేశాడు. 

ఈ ఫోటోలను ఏబీ  సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. ‘నా అందమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిస్సందేహంగా నాకు సరైన జోడీ. మేం నలుగురం (డివిలియర్స్ పిల్లలు) నిన్ను ప్రేమిస్తున్నాము’ అంటూ అందులో రాసుకొచ్చాడు.

ఏబీతో పాటు డేనియల్ కూడా తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ధనశ్రీతో పాటు డేనియల్ కలిసి ఉన్న ఫోటోలను కూడా డివిలియర్స్ భార్య షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ధనశ్రీ ని సోదరురాలిగా భావిస్తూ  పోస్టు చేసింది. నైట్ పార్టీకి రెడీగా ఉండాలని షేర్ చేసింది. 

డేనియల్ డివిలియర్స్ కు ఇన్స్టాగ్రామ్ లో  మంచి ఫాలోయింగ్ ఉంది. ముగ్గురు పిల్లల తల్లైనా ఆమె మాత్రం నిత్య యవ్వనంగా కనిపిస్తూ అందర్నీ మంత్రముగ్ధుల్ని చేస్తున్నది. 
 

Latest Videos

click me!