RCB: కోహ్లీ నుంచి డుప్లెసిస్ వ‌ర‌కు: ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్లు వీరే

Published : Feb 13, 2025, 01:37 PM ISTUpdated : Feb 14, 2025, 09:14 AM IST

Full List RCB Captains: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం కొత్త కెప్టెన్ ను ప్ర‌క‌టించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా విరాట్ కోహ్లీని కాద‌ని భార‌త యంగ్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ర‌జ‌త్ పాటిదార్ ను కెప్టెన్ గా నియ‌మించింది.  

PREV
16
RCB: కోహ్లీ నుంచి డుప్లెసిస్ వ‌ర‌కు: ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్లు వీరే
RCB Rajat Patidar

Full List RCB Captains: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీ20 క్రికెట్‌లో త‌న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో అద్భుతమైన నాయకత్వ ప్రయాణాన్ని కొన‌సాగిస్తోంది. భారత దిగ్గజ ప్లేయ‌ర్ల నుంచి అంతర్జాతీయ స్టార్ల వరకు  ఆర్సీబీ కెప్టెన్ల జాబితాలో ఉన్నారు. ఆ జ‌ట్టుకు ప‌నిచేసిన ప్రతి కెప్టెన్ ఒక ప్రత్యేకమైన శైలిని తీసుకువచ్చాడు.

రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో ప్ర‌యాణం మొద‌లు పెట్టిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లీ ఉద్వేగభరితమైన కెప్టెన్సీ కాలంతో పాటు ఫాఫ్ డు ప్లెసిస్ స్థిరమైన నాయకత్వంతో ముందుకు న‌డిచింది. ఆర్సీబీ కెప్టెన్సీల‌ చరిత్ర ఎత్తుపల్లాలతో ముందుకు సాగింది. రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా టీమిండియా యంగ్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ర‌జ‌త్ పాటిదార్ ను ప్ర‌క‌టించింది. అయితే, ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జ‌ట్టుకు కెప్టెన్లుగా ఎవ‌రెవ‌రు ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

26
Image Credit: Twitter/Sarang Bhalerao

1. రాహుల్ ద్రవిడ్ (2008):

భార‌త లెజెండ‌రీ ప్లేయ‌ర్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ గా ఉన్నారు. అయితే, ఆ  సీజ‌న్ లో బలహీనమైన జట్టుతో ఇబ్బంది పడ్డాడు. టీమ్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించింది. ఆ ఐపీఎల్ సీజ‌న్ లో పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో నిలిచింది. 

2. కెవిన్ పీటర్సన్ (2009):

ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ ప్లేయ‌ర్ కెవిన్ పీటర్సన్ 2009లో ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే, 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి కెప్టెన్సీని వ‌దులుకున్నాడు. అతని దూకుడు మనస్తత్వం ఆర్సీబీకి గొప్ప ఫ‌లితాలు ఇవ్వ‌లేదు. 

36
Image credit: PBKS

3. అనిల్ కుంబ్లే (2009-2010)

భార‌త లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఆర్సీబీ కెప్టెన్ గా వ‌చ్చిన త‌ర్వాత జ‌ట్టు పరిస్థితులను మొత్తంగా మార్చిప‌డేశాడు. ఆర్సీబీని ఐపీఎల్ 2009 ఫైనల్‌కు చేర్చాడు. 54.28%  విన్నింగ్ రేటుతో అనిల్ కుంబ్లే ఆర్సీబీ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచాడు.

4. డేనియల్ వెట్టోరి (2011-2012):

న్యూజిలాండ్ ఎడమచేతి వాటం స్పిన్నర్ 28 మ్యాచ్‌ల్లో 15 విజయాలు సాధించి జట్టుకు స్థిర‌త్వాన్ని అందించాడు. అతని కెప్టెన్సీలోఐపీఎల్ 2011లో ఆర్సీబీ ఫైనల్‌కు కూడా చేరుకుంది కానీ ట్రోఫీని గెలుచుకోలేకపోయింది.

46
Virat Kohli-Rajat Patidar

5. విరాట్ కోహ్లీ (2011-2023): 

విరాట్ కోహ్లీ 143 మ్యాచ్‌లకు ఆర్సీబీ కెప్టెన్ గా కొన‌సాగాడు. ఇందులో 66 మ్యాచ్‌లలో ఆర్సీబీ గెల‌వ‌గా, 70 మ్యాచ్‌లలో ఓడిపోయింది. కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోలేకపోయినప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించ‌డంతో పాటు కోహ్లీ దూకుడు కెప్టెన్సీలో బ‌ల‌మైన జ‌ట్టుగా మారింది. 

6. షేన్ వాట్సన్ (2017):

ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ 2017లో ఆర్సీబీకి కేవలం మూడు మ్యాచ్‌ల‌లో కెప్టెన్ గా ఉన్నాడు. ఇందులో ఒక మ్యాచ్ గెలిపించాడు. ఫ్రాంచైజీ కష్టకాలంలో ఉన్న స‌మ‌యంలో అత‌ను కెప్టెన్ గా వ‌చ్చాడు. 

56

7. ఫాఫ్ డు ప్లెసిస్ (2022-2024):

దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డు ప్లెసిస్ 2022 నుండి ఆర్సీబీని ముందుకు న‌డిపించాడు. అత‌ని కెప్టెన్సీలో ఆర్సీబీ  21 విజయాలు అందుకుంది. అలాగే, 21 ఓటములను కూడా చూసింది. అతని గొప్ప కెప్టెన్సీలో ఆర్సీబీ ట్రోఫీ గెలుస్తుందని భావించారు. కానీ, ఐపీఎల్ ఛాంపియన్ టైటిల్ ను ఆర్సీబీ గెలుచుకోలేకపోయింది.

66

ఐపీఎల్ లో ఆర్సీబీ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు? 

అనిల్ కుంబ్లే 54.28%  విన్నింగ్ రేటుతో ఆర్సీబీ బెస్ట్ కెప్టెన్ల‌లో టాప్ లో ఉన్నాడు. ఆ త‌ర్వాత‌ డేనియల్ వెట్టోరి (53.57%), ఫాఫ్ డు ప్లెసిస్ ప్రస్తుతం 50% లు ఉన్నారు. దశాబ్ద కాలం పాటు కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, కోహ్లీ విజయ శాతం 46.15% గా ఉంది. గత 17 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇప్పటివరకు కప్ గెలవలేకపోయింది. మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇప్పటివరకు ఆర్సీబీ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. మ‌రీ రాబోయే సీజ‌న్ లో ర‌జ‌త్ పాటిదార్ కెప్టెన్సీలో ఆర్సీబీ ఏం చేస్తుందో చూడాలి !

Read more Photos on
click me!

Recommended Stories