Rajat Patidar: విరాట్ కోహ్లీ కాదు.. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్

Published : Feb 13, 2025, 12:38 PM ISTUpdated : Feb 14, 2025, 09:14 AM IST

RCB Captain: ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ త‌న  కొత్త కెప్టెన్‌గా భారత యంగ్ ప్లేయ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఇంత‌కు ముందు రాబోయే సీజ‌న్ కోసం విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉంటార‌నే వార్త‌ల మ‌ధ్య బెంగ‌ళూరు టీమ్ కెప్టెన్ గా యంగ్ ప్లేయ‌ర్ ను ప్ర‌క‌టించ‌డం విశేషం.   

PREV
16
Rajat Patidar: విరాట్ కోహ్లీ కాదు.. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ కొత్త కెప్టెన్
virat Kholi

rajat patidar: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు రాబోయే ఐపీఎల్ 2025 సీజ‌న్ కోసం టైటిల్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే త‌న కొత్త కెప్టెన్ ను ప్ర‌క‌టించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా భార‌త యంగ్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ కు బెంగ‌ళూరు టీమ్ కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గించింది.

26

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ (ఆర్సీబీ) కెప్టెన్ గా ర‌జ‌త్ పాటిదార్ 

తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే దిశగా అడుగులు వేస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో RCB కెప్టెన్‌గా  యంగ్ ప్లేయ‌ర్ రజత్ పాటిదార్ నియమితులయ్యారు. కొత్త కెప్టెన్, కొత్త టీమ్ తో ఐపీఎల్ 2025ని గ్రాండ్ గా ప్రారంభించాల‌నీ, ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ గెల‌వాల‌ని ఆర్సీబీ ల‌క్ష్యంగా పెట్టుకుంది.

36
RCB Rajat Patidar

విరాట్ కోహ్లీ కెప్టెన్ అనుకున్నారు కానీ.. 

రాబోయే ఐపీఎల్ సీజ‌న్ 2025 కోసం ఆర్సీబీ కెప్టెన్ గా మ‌ళ్లీ విరాట్ కోహ్లీ వ‌స్తార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కానీ, బెంగ‌ళూరు ఫ్రాంఛైజీ ఇప్పుడు కోహ్లీ కాకుండా  ర‌జ‌త్ పాటిదార్ కు కెప్టెన్సీని అప్ప‌గించింది. ఇదివ‌ర‌కే విరాట్ కోహ్లీ బెంగ‌ళూరు టీమ్ కు కెప్టెన్ గా ప‌నిచేశాడు. కెప్టెన్సీ వ‌ద్ద‌ని ప‌క్క‌కు త‌ప్పుకున్నాడు. కాబ‌ట్టి మ‌ళ్లీ కెప్టెన్సీ కోహ్లీకి చేర‌లేదు. వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ర‌జ‌త్ పాటిదార్ బెంగ‌ళూరు టీమ్ ను రాబోయే సీజ‌న్ లో ముందుకు  న‌డిపించ‌నున్నాడు. 

46
Virat Kohli-Rajat Patidar

ఐపీఎల్ 2024లో వ‌రుస ఓట‌ము త‌ర్వాత ఆర్సీబీ సూప‌ర్ షో

గత ఐపీఎల్ 2024 ఎడిషన్ మొదటి అర్ధభాగంలో పేలవమైన ప్రదర్శనతో వ‌రుస ఓట‌ముల‌ను చూసిన ఆర్సీబీ టీమ్.. ఆ తర్వాత సూప‌ర్ గేమ్ తో వరుసగా 7 మ్యాచ్‌లను గెలిచి ప్లేఆఫ్‌లోకి ప్రవేశించింది. అయితే, ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆర్సీబీ జట్టు గ‌తంలో చేసిన త‌న తప్పులను సరిదిద్దుకుని 18వ ఎడిషన్‌లో కొత్త మొద‌లుపెట్ట‌డానికి సిద్ధంగా ఉంది. 

56

అద్భుతమైన ఆట‌తో రాణించినందుకు ర‌జ‌త్ పాటిదార్ కు కెప్టెన్సీ 

గత ఐపీఎల్ సీజన్ లో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ద్వితీయార్థంలో తన విధ్వంసక బ్యాటింగ్‌తో అంద‌రి దృష్టిని ఆకర్షించిన రజత్ పాటిదార్‌ను RCB ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమించింది. రజత్ పాటిదార్ పై ఉన్న నమ్మకం కారణంగా ఆర్సీబీ ఫ్రాంచైజీ ఐపీఎల్ మెగా వేలానికి ముందే మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ ను రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ యంగ్ ప్లేయ‌ర్ ను బెంగళూరు జట్టు కెప్టెన్‌గా చేసింది.

66

ఐపీఎల్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సీబీని న‌డిపించిన కెప్టెన్లు వీరే 

గత 17 సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఇప్పటివరకు కప్ గెలవలేకపోయింది. మూడుసార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకోవడం ఇప్పటివరకు ఆర్సీబీ అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. 

ఐపీఎల్ లో ఆర్సీబీ కెప్టెన్లు

2008- రాహుల్ ద్రవిడ్
2009- కెవిన్ పీటర్సన్
2009-10- అనిల్ కుంబ్లే
2011-12- డేనియల్ వెట్టోరి
2017- షేన్ వాట్సన్
2013-21- విరాట్ కోహ్లీ
2022-24- ఫాఫ్ డు ప్లెసిస్
2025- రజత్ పాటిదార్

Read more Photos on
click me!

Recommended Stories