Virat Kohli
Ayodhya Ram Mandir-Virat Kohli: భారత చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. వందల సంవత్సరాల నుంచి వేచిచూస్తున్న అయోధ్య రామమందిరం కల సాధ్యం అయింది. సోమవారం అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంగా ఘనంగా పూర్తయింది.
Virat Kohli
అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి దాదాపు అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు విచ్చేశారు. రామ మందిరాన్ని చూసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఈ కార్యక్రమానికి రాకుండానే శ్రీరాముని ఆశీర్వాదం తీసుకున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Virat Kohli
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రముఖుల జాబితాలో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు.
Virat Kohli
అయితే, బిజీ క్రికెట్ షెడ్యూల్ కారణంగా విరాట్ కోహ్లీ అయోధ్యకు రాలేకపోయాడు.అయితే, ఆలయానికి దూరంగా ఉన్నప్పటికీ విరాట్ శ్రీరాముడిని దర్శించుకున్నారు. విరాట్ కు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Virat Kohli
22 జనవరి 2024న రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక తర్వాత భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీనిలో విరాట్ కోహ్లీ శ్రీరామ ప్రభువు పాదాలకు తాకుతూ నమస్కరిస్తున్నాడు.
Virat Kohli
అయోధ్యలోని బ్రహ్మాండమైన రామజన్మభూమి ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరాముడి బాలరాముని రూపంలో కనిపించిచారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శ్రీరాముడి పాదాలకు నమస్కరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఇవన్నీ ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటోలు కావడం విశేషం.