విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ప్రాక్టీస్.. ఆఖరికి శుబ్‌మన్ గిల్ కూడా...

First Published | Oct 27, 2023, 2:49 PM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మొదటి ఐదు మ్యాచుల్లో గెలిచి, సెమీ ఫైనల్ బెర్త్ దాదాపు కన్ఫార్మ్ చేసుకుంది టీమిండియా. మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకున్నా, మిగిలిన జట్లతో సంబంధం లేకుండా సెమీస్ చేరుకుంటుంది..
 

ధర్మశాలలో న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో ఘన విజయం అందుకున్న భారత జట్టు, ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కోసం లక్నో చేరుకుంది. వారం రోజుల గ్యాప్ రావడంతో టీమిండియా ప్లేయర్లకు రెండు రోజుల బ్రేక్ ఇచ్చింది మేనేజ్‌మెంట్...
 

Suryakumar Yadav


బ్రేక్ టైం ముగించుకున్న ప్లేయర్లు, తిరిగి క్యాంపులో కలిశారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కి ముందు భారత బ్యాటర్లు కూడా బౌలింగ్‌పైన ఫోకస్ పెట్టడం విశేషం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కూడా ఆడడం లేదు..
 

Latest Videos


టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇంగ్లాండ్‌‌తో మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ పరాజయం నుంచి తేరుకోవడానికి భారత జట్టుకి చాలా సమయం పట్టింది.. 

అదీకాకుండా మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిన ఇంగ్లాండ్‌ పరువు కాపాడుకునేందుకు ఆడే పరిస్థితిలో పడింది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌లోనూ భారీ తేడాతో గెలిస్తేనే మిణుకు మిణుకు మంటూ ఉన్న కాసిన్ని ఆశలు సజీవంగా మిగులుతాయి.

దీంతో ఇండియాతో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విశ్వరూపం చూపించే ప్రయత్నం చేయొచ్చు. దీంతో ముందు జాగ్రత్తగా భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు..
 

Virat Kohli

రెగ్యూలర్ బౌలర్లు వికెట్లు తీయలేనప్పుడు పార్ట్ టైమ్ బౌలర్లే.. మ్యాచ్‌ని మలుపు తిప్పుతారు. అందుకే ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో ఈ అస్త్రాలను వాడాలని భావిస్తోందట టీమ్ మేనేజ్‌మెంట్.. 

click me!