కెప్టెన్‌గా కంటే ధోనీ డిప్యూటీగానే ఎక్కువ ఎంజాయ్ చేశా... విరాట్ కోహ్లీ సడెన్ ట్వీట్‌తో ఫ్యాన్స్‌లో...

First Published Aug 26, 2022, 9:29 AM IST

అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌గా టీమిండియాలోకి వచ్చి, అతి తక్కువ కాలంలోనే జట్టులో మెయిన్ ప్లేయర్‌గా మారిపోయాడు విరాట్ కోహ్లీ... ఎమ్మెస్ ధోనీ నుంచి మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న మాజీ కెప్టెన్, టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు.  

8 ఏళ్ల కెప్టెన్సీ కెరీర్ కంటే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి డిప్యూటీ చేసిన రోజుల్లోనే క్రికెట్‌ని ఎక్కువ ఎంజాయ్ చేశానంటున్నాడు విరాట్ కోహ్లీ...
 

ఎమ్మెస్ ధోనీ పార్టనర్‌షిప్ నెలకొల్పిన ఫోటోను షేర్ చేసిన విరాట్ కోహ్లీ... ‘ఈ వ్యక్తికి నమ్మకమైన డిప్యూటీగా ఉన్న రోజులు నా కెరీర్‌లో నేనెంతో ఎంజాయ్ చేసిన క్షణాలు.. మా పార్టనర్‌షిప్ ఎప్పుడూ నాకు స్పెషల్‌గానే ఉండిపోతుంది. 7+18 లవ్...’ అంటూ రాసుకొచ్చాడు...

మాహీతో విరాట్ కోహ్లీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాలో విరాట్ కోహ్లీ కీ బ్యాటర్‌గా మారడానికి ఆ తర్వాత కెప్టెన్‌గా మారడానికి కూడా ఎంఎస్ ధోనీ ఇచ్చిన సపోర్టే కారణం. అయితే ఇంత సెడన్‌గా కోహ్లీకి ధోనీ ఎందుకు గుర్తుకువచ్చాడు? అనేదే అభిమానుల అనుమానం...

Kohli and Dhoni

కొన్నాళ్లుగా సోషల్ మీడియాని ప్రమోషనల్ పోస్టులు చేయడానికి మాత్రమే వాడుతున్నాడు విరాట్ కోహ్లీ. ఆగస్టు 18న అంతర్జాతీయ క్రికెట్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ... ఈ ప్రయాణం తనకెంతో గర్వకారణమంటూ ఓ వీడియో పోస్టు చేశాడు...

సడెన్‌గా క్రికెట్ కెరీర్‌లో జరిగిన విషయాల గురించి పోస్ట్ చేస్తుండడంతో రిటైర్మెంట్ గురించి షాక్ ఏమైనా ఇస్తాడేమోనని భయపడుతున్నారు అభిమానులు. అసలే విరాట్ కోహ్లీకి ఈ మధ్య టైం అస్సలు బాలేదు. కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పిన తర్వాత పెద్దగా మ్యాచులు ఆడడానికి కూడా ఆసక్తి చూపించలేదు విరాట్ కోహ్లీ...

ఈ ఏడాది నాలుగు టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌లో ఫెయిల్ అయితే అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఉండకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ కంటే ఫామ్‌లో ఉన్న దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్లేయర్లకు తుదిజట్టులో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ క్రికెటర్లు...

Kohli-Dhoni

దీంతో విరాట్ కోహ్లీ ఏదైనా సంచలనం నిర్ణయం తీసుకోబోతున్నాడా? అందుకే తన కెరీర్‌లో ముఖ్యమైన విషయాల గురించి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడా? అనేది అభిమానుల్లో వేల ప్రశ్నలు రేగేలా చేస్తోంది.. 

ఆసియా కప్ 2018 టోర్నీలో ఆడని విరాట్ కోహ్లీ, ఆసియా కప్‌ చరిత్రలో ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ప్లేయర్‌గా 183 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా 136 పరుగులు బాది టాప్ స్కోరర్‌గా నిలిచాడు...

click me!