విరాట్ కోహ్లీ, సిరాజ్ ఆటపై ప్రేమను చూపించారు, నాపై నాకే చిరాకు వేసింది... బెన్‌స్టోక్స్ కామెంట్...

First Published Mar 5, 2021, 11:09 AM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు, మొదటి రోజు ఆటలో అందర్నీ ఆకర్షించిన విషయం బెన్ స్టోక్స్, సిరాజ్, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన మాటల యుద్ధం. సిరాజ్‌పై బెన్ స్టోక్స్ నోరుపారేసుకోవడం, మధ్యలో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చి, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ నోరు మూయించడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. మొదటి రోజు ఆట ముగిసిన అనంతరం దీనిపై మాట్లాడాడు బెన్ స్టోక్స్...

‘మూడో టెస్టుతో పోలిస్తే ఇప్పుడు పిచ్ బ్యాటింగ్‌కి బాగా సహకరిస్తోంది. ఇలాంటి పిచ్‌పై భారీ స్కోరు చేయకుండా అవుట్ కావడం నిరాశపరిచింది. హాఫ్ సెంచరీ పెద్ద స్కోరేమీ కాదు... టెస్టు మ్యాచ్ గెలవాలంటే భారీ స్కోరు సాధించాలి...
undefined
దాదాపు రెండున్నర గంటలు క్రీజులో ఉన్నాను. చాలా బాగా అనిపించింది. కానీ ఏ మాత్రం టర్న్ లేని బాల్‌కి అవుట్ అయ్యాను... అవుట్ కాకూడదని బలంగా అనుకున్నాను. కానీ ఇలా అవుట్ కావడం నాపై నాకే చిరాకు తెప్పించింది...
undefined
తొలి ఇన్నింగ్స్‌లో మేం చేయాలనుకున్నన్ని పరుగులు మాత్రం చేయలేకపోయాం. నేను ఇప్పటిదాకా 70 టెస్టులు ఆడి ఉంటాను. కానీ ఓ బ్యాట్స్‌మెన్‌గా నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరిస్థితులు మాత్రం ఇవే...
undefined
వచ్చే పర్యటనలో కచ్ఛితంగా మెరుగ్గా రాణించాలని అనుకుంటున్నా... ఇక్కడికి వస్తే రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌ను ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే అతని బౌలింగ్‌లోనే ఎక్కువసార్లు అవుట్ అయ్యాను...అతను ఓ అద్భుతమైన బౌలర్’ అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్.
undefined
భారత పేసర్ మహ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీతో జరిగిన గొడవ గురించి మాట్లాడిన బెన్ స్టోక్స్... ‘అదేం పెద్ద విషయం కాదు. వాళ్లిద్దరూ ప్రొఫెషనల్ ప్లేయర్స్. క్రికెట్‌పై తమకున్న ప్రేమను చూపించారు...
undefined
ఈ మధ్యకాలంలో చాలా మ్యాచుల్లో ఇలా జరుగుతోంది. కానీ అది గొడవ దాకా వెళ్లడం లేదు... మహ్మద్ సిరాజ్‌పై నేను కామెంట్ చేశాక, విరాట్ కోహ్లీ ఓ కెప్టెన్‌లా స్పందించాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు బెన్ స్టోక్స్...
undefined
తొలి ఇన్నింగ్స్‌లో 121 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు బెన్ స్టోక్స్...
undefined
click me!