ఆర్‌సీబీకి ఆడడం కెరీర్ బెస్ట్ మూమెంట్, కానీ సీఎస్‌కేలో మాత్రం అది ఉంది... షేన్ వాట్సన్ షాకింగ్ కామెంట్!

First Published Mar 5, 2021, 9:56 AM IST

షేన్ వాట్సన్... ఈ పేరు చెప్పగానే చాలామందికి మోకాలికి గాయమై, రక్తం కారుతున్నా బ్యాటింగ్ కొనసాగించిన ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది. అలాంటి డెడికేషన్‌తో భారతీయుల మనసు దోచుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్, గత ఏడాది ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఐపీఎల్ ప్రస్థానం గురించి మాట్లాడాడు షేన్ వాట్సన్...

2009 మినహా 12 సీజన్ల పాటు ఐపీఎల్ ఆడిన షన్ వాట్సన్, మొత్తం 145 మ్యాచులు ఆడి 3874 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా బౌలింగ్‌లో 92 వికెట్లు పడగొట్టిన షేన్ వాట్సన్, 190 సిక్సర్లు బాదాడు...
undefined
‘నా కెరీర్‌లో బెస్ట్ మూమెంట్ అంటే విరాట్ కోహ్లీతో కలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఆడడమే. అదో అద్భుతమైన అనుభవం, దానికి రెండు కారణాలు ఉన్నాయి.
undefined
విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్, క్రిస్ గేల్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నాను. అంతేకాకుండా విరాట్ కోహ్లీ జట్టును నడిపించే విధానాన్ని దగ్గర్నుంచి చూడగలిగాను...
undefined
అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ, ఆటగాళ్లతో నడుచుకునే విధానం పూర్తిగా కార్పొరేట్ స్టైల్‌లో ఉంటుంది. వాళ్లు ఆటగాళ్లతో కలవడానికి ఏ మాత్రం ప్రయత్నించరు...
undefined
చెన్నై సూపర్ కింగ్స్ అలా కాదు. సీఎస్‌కేలో ఆటగాళ్లు, ఫ్రాంఛైజీ యజమానులకు మధ్య ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంటుంది. అందుకే సీఎస్‌కేకి ఆడడం ఓ అద్భుతమైన అనుభవం...
undefined
చాలామంది సీఎస్‌కేని సీనియర్ సిటిజన్స్ టీమ్ అంటూ ఉంటారు. అవును... అది నిజమే కానీ కెప్టెన్ ధోనీ జట్టులోని ఆటగాళ్లపై ఉంచే నమ్మకం, వారిని ఉపయోగించుకునే విధానం టాప్ లెవెల్...
undefined
నాకు తెలిసి నేను చూసిన బెస్ట్ కోచ్‌లలో సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒకరు. ఆయన పర్యవేక్షణలో ఆడడం ఓ గొప్ప అనుభూతి. అతను ఆటగాళ్లను, టీమ్ వాతావరణాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు... ధోనీతో కూడా కోచ్‌కి మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది...’ అని చెప్పుకొచ్చాడు షేన్ వాట్సన్...
undefined
‘క్రికెట్‌లోనే కాదు, బయట కూడా విరాట్ కోహ్లీ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్. అతన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రతి ఒక్క ప్లేయర్ గురించి తెలుసుకోవడానికి కోహ్లీ ఆసక్తి చూపిస్తాడు...
undefined
ఏబీ డివిల్లియర్స్‌తో ఆడడం చాలా చక్కని అనుభవం. అతను ఆడుతుంటే, టీవీలకు అతుక్కుపోయి అలా చూడాలనిపిస్తుంది...’ అంటూ వివరించాడు ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్...
undefined
click me!