కోహ్లీ టీ20ల నుంచి తప్పుకుంటే బెటర్... అప్పుడు ఫామ్ అన్నారు, ఇప్పుడు రిటైర్మెంట్ మీద పడ్డారు...

First Published Sep 15, 2022, 3:26 PM IST

విరాట్ కోహ్లీ... వరల్డ్ మోస్ట్ పాపులర్ క్రికెట్ సెలబ్రిటీ. అందుకే విరాట్ కోహ్లీ గురించి ఏదో ఒకటి కామెంట్ చేసి వార్తల్లో నిలవాలని అనుకుంటారు చాలామంది మాజీ క్రికెటర్లు. పనిలేక వ్యూస్ కోసం యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్లకైతే విరాట్ కోహ్లీ మంచి మార్కెటింగ్ బ్రాండ్. అందుకే విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించేందుకు మార్గాలు వెతుకుతూ ఉంటారు...

ఆసియా కప్ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ గురించి బీభత్సమైన చర్చ జరిగింది. విరాట్ కోహ్లీ టీ20లకు పనికి రాడని కొందరు, అతను రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అని మరికొందరు కామెంట్లు చేశారు. ఈ వార్తలకు సమాధానం ఇస్తూ 1020 రోజుల తర్వాత అంతర్జాతీయ సెంచరీ సాధించాడు విరాట్ కోహ్లీ..

ఆఫ్ఘాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో అదిరిపోయే సెంచరీ బాది, మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. దీంతో ఇప్పుడు కొందరు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి కామెంట్లు చేస్తున్నారు...

పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ, విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటే బెటర్ అంటూ కామెంట్ చేయగా తాజాగా షోయబ్ అక్తర్, విరాట్ టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకోవాలంటూ కామెంట్ చేశాడు...

‘విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత టీ20ల నుంచి తప్పుకుంటే బెటర్. అతనికి టెస్టు ఫార్మాట్ అంటే చాలా ఇష్టం. అలాగే వన్డేల్లో కూడా 40కి పైగా సెంచరీలు చేశాడు...

Image Credit: Anushka Sharma Instagram

కాబట్టి మిగిలిన ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం అందుబాటులో ఉండాలంటే పొట్టి ఫార్మాట్‌కి సాధ్యమైనంత దూరం ఉండడం మంచిది. నేను అతని ప్లేస్‌లో ఉంటే సుదీర్ఘ ఫార్మాట్‌కి ఎక్కువ కాలం అందుబాటులో ఉండేలా అవసరమైన నిర్ణయాలు తీసుకునేవాడిని... ’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...

అక్తర్ కామెంట్లకు ముందు షాహిదీ ఆఫ్రిదీ కూడా ఇదే విధమైన కామెంట్లు చేశాడు. ‘విరాట్ కోహ్లీ కెరీర్‌ని ఆరంభిన విధానం, అతను ఎదుర్కొన్న ఇబ్బందులు, గడ్డు కాలం, మళ్లీ ఫామ్‌ని అందుకున్న తీరు... అన్నీ అతను ఛాంపియన్ ప్లేయర్ అనడానికి నిదర్శనం. రిటైర్మెంట్ సమయానికి కూడా విరాట్ కోహ్లీ అలాగే ఉండాలి...

Image credit: Getty

పేలవ ఫామ్‌లో టీమ్‌లో ప్లేస్‌ కోల్పోయి రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి విరాట్ కోహ్లీకి రాకూడదు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో చాలా తక్కువ మంది ప్లేయర్లు రిటైర్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ కూడా ఆ జాబితాలో ఉండాలి.. అతను కెరీర్‌ని ఆరంభించిన విధంగానే, ముగింపు పలుకుతాడని ఆశిస్తున్నా..’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ...

ఆఫ్రిదీ కామెంట్లపై భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా స్పందించాడు. ‘డియర్ ఆఫ్రిదీ, కొందరు ప్లేయర్లు ఒకేసారి రిటైర్ అవుతాడు. విరాట్ కూడా అలాంటి వాడే’ అంటూ ఆఫ్రిదీని ట్రోల్ చేశాడు. పాక్ ఆల్‌రౌండర్ షాహిదీ ఆఫ్రిదీ, తన అంతర్జాతీయ కెరీర్‌కి 5 సార్లు రిటైర్మెంట్ ప్రకటించాడు. నాలుగు సార్లు మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆఫ్రిదీ... 2022 వరకూ క్రికెట్‌లో (పీఎస్‌ఎల్)కొనసాగుతూనే ఉన్నాడు.

click me!