అశ్విన్‌ని ఎందుకు సెలక్ట్ చేశారు? అతన్ని ఎలా వాడతారు?... సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్...

Published : Sep 15, 2022, 01:30 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత నేరుగా టీ20 వరల్డ్ కప్‌లో ఎంట్రీ ఇచ్చిన రవి అశ్విన్, ఆ టోర్నీలో 3 మ్యాచుల్లో 6 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలోనూ చోటు దక్కించుకోగలిగాడు అశ్విన్...

PREV
16
అశ్విన్‌ని ఎందుకు సెలక్ట్ చేశారు? అతన్ని ఎలా వాడతారు?... సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్...
Image credit: Getty

గత ఎడిషన్‌ని మిస్ చేసుకున్న యజ్వేంద్ర చాహాల్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ఎంపిక చేసిన సెలక్టర్లు, అతనితో పాటు స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లకు 15 మంది జట్టులో చోటు కల్పించారు. యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌కి స్టాండ్ బై ప్లేయర్‌గా చోటు దక్కింది...

26
Image credit: Getty

‘రవిచంద్రన్ అశ్విన్‌ని ఎందుకు సెలక్ట్ చేశారో నాకైతే అర్థం కావడం లేదు. టీ20 క్రికెట్‌లో ఫీల్డింగ్ చాలా కీలకం. రెండు అద్భుతమైన క్యాచులు మ్యాచ్ ఫలితాన్నే మార్చేయగలవు. ఏ ప్లేయర్ అయినా బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొడితే అతనికి ఫీల్డింగ్ సరిగా రాకపోయినా క్షమించి వదిలేయొచ్చు...

36

అయితే రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌లో మరీ అద్భుతాలు చేయలేడు. బౌలింగ్‌లోనూ టీ20లకు అతను పెద్దగా సెట్ కాడు. అందుకే అతన్ని టీ20 వరల్డ్ కప్‌కి ఎంపిక చేయడం చూసి షాక్ అయ్యా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..

46
ravichandran ashwin

రవిచంద్రన్ అశ్విన్ గత 10 టీ20 మ్యాచుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. అందులోనూ అతని ఎకానమీ 6.10గా ఉంది. ఈ ఏడాది 10 వికెట్లు తీసిన భారత స్పిన్నర్లలో అత్యుత్తమ ఎకానమీ అశ్విన్ సొంతం...

56
Harshal Patel

‘హర్షల్ పటేల్, తుది 11 మంది ప్లేయర్లలో కచ్ఛితంగా ఉంటాడు. అతనికి దేశవాళీ క్రికెట్‌లో మంచి అనుభవం ఉంది. ఆసియా కప్ అనుభవంతో మహ్మద్ షమీని టీ20లకు తీసుకొచ్చినా డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్, టీమ్‌కి కీ బౌలర్...

66
Arshdeep Singh

అర్ష్‌దీప్ సింగ్ చాలా రేర్ టాలెంటెడ్ బౌలర్. అతను యార్కర్లు వేస్తూ టాప్ క్లాస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు... అర్ష్‌దీప్ ఎంపిక సరైనదే...’ అంటూ కామెంట్ చేశాడు సంజయ్ మంజ్రేకర్... 

click me!

Recommended Stories