స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ... టెస్టు సిరీస్‌లో అతనితోనే అసలు సమస్య...

First Published Feb 3, 2023, 2:47 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇరుజట్లు ముమ్మురంగా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాయి. ఈసారి టెస్టు సిరీస్ గెలవాలని గట్టిగా ఫిక్స్ అయిన ఆస్ట్రేలియా, భారత స్పిన్ బౌలర్లను ఎదుర్కొనేందుకు వీలుగా భారత దేశవాళీ స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉండేందుకు పగుళ్లు తేలిన పిచ్‌పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు స్మిత్ అండ్ కో...
 

విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియాతో 19 టెస్టులు ఆడిన విరాట్ కోహ్లీ, 34 ఇన్నింగ్స్‌ల్లో 48.61 సగటుతో 1604 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 

అయితే ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్‌కి విరాట్ కోహ్లీపై మంచి రికార్డు ఉంది. నాథన్ లియాన్ బౌలింగ్‌లో 7 సార్లు అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. 732 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, 384 పరుగులు సాధించాడు. 479 డాట్ బాల్స్ ఆడాడు...

Image credit: Getty

అలాగే ప్యాట్ కమ్మిన్స్ 5 టెస్టుల్లో 4 సార్లు విరాట్‌ని అవుట్ చేశాడు. ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు 32.7 మాత్రమే. వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, నాథన్ లియాన్‌ని ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది...
 

Image credit: Getty

‘విరాట్ కోహ్లీ స్పిన్‌ని చాలా బాగా ఆడగల భారత బ్యాటర్లలో ఒకడు. అయితే కొంతకాలంగా అతను స్పిన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి, వికెట్ పారేసుకుంటున్నాడు. స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి, లేదా క్లీన్ బౌల్డ్ అయి పెవిలియన్ చేరుతున్నాడు...
 

నాథన్ లియాన్ బౌలింగ్‌లో డిఫెన్స్ కంటే అటాకింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓ రెండు, మూడు ఫోర్లు బాదితే నాథన్ లియాన్ ప్రెషర్‌లో పడిపోతాడు. అయినా విరాట్ కోహ్లీకి ఎలా ఆడాలో చెప్పాల్సిన అవసరం లేదు. అతనికి అన్నీ తెలుసు..
 

టెస్టు క్రికెట్‌లో నాథన్ లియన్‌ని విరాట్ కోహ్లీ ఎలా ఫేస్ చేస్తాడో చూడాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియానే ఫెవరెట్ అయినా ఆస్ట్రేలియాని తక్కువ అంచనా వేయలేం. వాళ్లు ఇప్పటికే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి అర్హత సాధించారు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... 

click me!